షియోమీ ఎంఐ4ఐ vs మైక్రోమాక్స్ యు యురేకా vs లెనోవో ఏ7000

Posted By:

షియోమీ ఎంఐ4ఐ..షియోమీ ఎంఐ4ఐ..లెనోవో ఏ7000, ప్రస్తుత బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ మూడు ఫోన్‌లే ట్రెండింగ్ టాపిక్. 2జీబి ర్యామ్, 4జీ కనెక్టువిటీ వంటి ప్రత్యేక ఫీచర్లతో లభ్యమవుతోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లు ఫ్లాష్ సేల్ రూపంలో దేశవ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. షియోమీ ఎంఐ4ఐ..షియోమీ ఎంఐ4ఐ..లెనోవో ఏ7000ల ఫీచర్లను విశ్లేషిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని మీముందుకు తెస్తున్నాం...

(ఇంకా చదవండి: స్మార్ట్‌ఫోన్‌లతో 10 క్రేజీ పనులు )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే విషయానికొస్తే...

షియోమీ ఎంఐ4ఐ 441 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో 5.0 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. లెనోవో ఏ7000 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉన్నప్పటికి 267 పీపీఐ పిక్సల్ డెన్సిటీని మాత్రమే కలిగి ఉంది. మరోవైపు మైక్రోమాక్స్ యు యురేకా ఫోన్ కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేతో 267 పీపీఐ పిక్సల్ డెన్సిటీని మాత్రమే తీసుకుంది.

 

చుట్టుకొలత ఇంకా బరువు

షియోమీ ఎంఐ4ఐ చుట్టుకొలత 138.1 x 69.6 x 7.8మిల్లీ మీటర్లు, బరువు 130 గ్రాముల. లెనోవో ఏ7000 చుట్టుకొలత 152.6 x 76.2 x 7.9 మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు. మైక్రోమాక్స్ యు యురేకా చుట్టుకొలత 154 x 78 x 8.5 మిల్లీ మీటర్లు, బరువు 155 గ్రాములు.

 

ప్రాసెసర్:

షియోమీ ఎంఐ4ఐ, మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో ఏ7000.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఆక్టా కోర్ సీపీయూ పై రన్ అవుతాయి.

 

బ్యాటరీ విషయానికొస్తే:

షియోమీ ఎంఐ4ఐ స్మార్ట్‌ఫోన్ 3120 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ పై స్పందిస్తుంది. మైక్రోమాక్స్ యు యురేకా 2500 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ పై స్పందిస్తుంది. లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్ 2900 ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ పై స్పందిస్తుంది.

 

కెమెరా విషయానికొస్తే:

షియోమీ ఎంఐ4ఐ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలను కలిగి ఉంది. షియోమీ స్మార్ట్‌ఫోన్ తరహాలోనే మైక్రోమాక్స్ యు యురేకా కూడా 13 మెగా పిక్సల్ రేర్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థలను కలిగి ఉంటుంది. లెనోవో ఏ7000 8 మెగా పిక్సల్ రేర్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది.

 

ఇంటర్నల్ మెమరీ విషయానికొస్తే:

షియోమీ ఎంఐ4ఐ అలానే మైక్రోమాక్స్ యు యురేకా స్మార్ట్‌ఫోన్‌లు 16జీబి ఇంటర్నల్ మెమరీని కలిగి ఉన్నాయి. లెనోవో ఏ7000 8జీబి ఇంటర్నల్ మెమరీతలో లభ్యమవుతోంది.

 

ర్యామ్ విషయానికొస్తే

షియోమీ ఎంఐ4ఐ, మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో ఏ7000.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 2జీబి ర్యామ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

 

ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ

షియోమీ ఎంఐ4ఐ స్మార్ట్‌ఫోన్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ లోపించింది. మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్‌లలో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఫీచర్ ద్వారా మెమరీని 32జీబి వరకు విస్తరించుకోవచ్చు.

 

కనెక్టువిటీ:

షియోమీ ఎంఐ4ఐ, మైక్రోమాక్స్ యు యురేకా, లెనోవో ఏ7000.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తాయి.

 

ధరలు:

మార్కెట్ో షియోమీ ఎంఐ4ఐ ధర రూ.12,999, మైక్రోమాక్స్ యు యురేకా ధర రూ.8,999, లెనోవో ఏ7000 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi4i vs Micromax Yu Yureka vs Lenovo A7000. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot