తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఈ సీజన్‌లో అధికముగింపు స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? మీ కోసం ప్రత్యేక ధర తగ్గింపు పై పలు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు  మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నేటి యువత కొత్త దుస్తులు కొనుక్కున్నంత సలువుగా స్మార్ట్‌ఫోన్‌లను మార్చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ దిగితే చాలు, తమ వద్ద ఉన్న పాత మోడల్‌ఫోన్‌ను ఏదో ఒక సాకుతో ఎంతోకొంతకి అమ్మేసి కొత్త డివైస్‌కు అప్‌గ్రేడ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఫోన్‌ను కొనుగోలు చేసేముందు పాటించవల్సిన 10సూచనలను మీ ముందుంచుతున్నాం. క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Motorola Moto G

ఫోన్ వాస్తవ ధర రూ.12,499
ప్రస్తుత ధర రూ.10,499

కీలక ఫీచర్లు: 4.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్

మెమెరీ, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3

ఫోన్ వాస్తవ ధర రూ.47,990
ప్రస్తుత ధర రూ.40,698

కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ఎస్-స్టైలస్ పెన్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Samsung Galaxy Note 3 Neo

ఫోన్ వాస్తవ ధర రూ.38,990,
ప్రస్తుత ధర రూ.27,429

కీలక ఫీచర్లు: 5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.7గిగాహెట్జ్ హెక్సా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్), 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఎస్-పెన్ స్టైలస్.

 

తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Oppo N1

ఫోన్ వాస్తవ ధర రూ.37,990
ప్రస్తుత ధర రూ.32,990

ఫోన్ కీలక ఫీచర్లు: 5.9 అంగళాల డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 600 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ కలర్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), 13 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్ సీ, డీఎల్ఎన్ఏ, వై-పై, 3జీ), 3610 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

తాజాగా ధర తగ్గింపును అందుకున్న 5 స్మార్ట్‌ఫోన్‌లు

Oppo R1

ఫోన్ వాస్తవ ధర రూ.26,990
ప్రస్తుత ధర రూ.24,990

కీలక ఫీచర్లు: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంరట్నల్ మెమరీ, 3410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, ఎ-జీపీఎస్).

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Smartphones That Recently Got Price Cut in India. Read more in Telugu 
 Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot