లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

By Sivanjaneyulu
|

భారీ అంచనాల మధ్య లెనోవో తన వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. కే3 నోట్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ అత్యుత్తమ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊరిస్తోంది. లెనోవో నుంచి కొత్త ఏడాదిలో విడుదల కాబోతున్న ఈ కిల్లర్ నోట్ అమ్మకాల సునామీని సృష్టిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. వెబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

సంచలనం రేపుతున్న సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

థియేటర్ మాక్స్ (TheaterMax)

TheaterMax పేరుతో సరికొత్త ఫీచర్‌ను లెనోవో తన కే4 నోట్ ఫోన్‌లో పొందుపరిచింది. కంపెనీ చెబుతోన్న దాన్ని ప్రకారం ఈ వర్చువల్ రియాలిటీ ఫీచర్ యూజర్లకు పెద్ద తెర పై సినిమా చూస్తున్న అనుభూతులను చేరువచేస్తుంది. థియేటర్ మాక్స్ ఫీచర్ ఏ మోడల్ వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ తోనైనా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

 

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో తన కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌లో 1.5 వాట్ సామర్థ్యంతో కూడిన రెండు ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లను ఏర్పాటు చేసింది. డాల్బీ ఆటామస్ ఆడియో టక్నాలజీ ఈ స్పీకర్ల క్వాలిటీని మరింత రెట్టింపు చేస్తుంది.

 

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో తన కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 3జీబి ర్యామ్‌తో వస్తోంది. ఫోన్‌లో పొందుపరిచిన 64 బిట్ మీడియా టెక్ ఎంటీ6753 సాక్ ప్రాసెసర్‌కు ఈ ర్యామ్ మరింత తోడ్పాటుగా ఉంటుంది.

 

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్‌ను మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యుల్ క్రింద ఏర్పాటు చేసిన ఈ స్కానర్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

 

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

వైబ్ కే4 నోట్ స్మార్ట్‌ఫోన్ NFC సెన్సార్ లను సపోర్ట్ చేయటం విశేషం. ఈ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ టూల్ ద్వారా రెండు ఎలక్ట్రానిక్ డివైస్‌ల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో కమ్యూనికేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

 

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్,

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

ఆక్టా కోర్ మీడియాటెక్ 6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫ్రంట్ డ్యుయల్ స్పీకర్స్ విత్ థియేటర్‌మాక్స్ సౌండ్ టెక్నాలజీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీఎల్టీఈ కనెక్టువిటీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో పనిచేసే 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లెనోవో  కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

లెనోవో కే4 నోట్ ఎందుకంత బెస్ట్..?

ఈ ఫోన్‌కు సంబంధించి మొదటి ఎక్స్‌‍‌క్లూజివ్ ఫ్లాష్ సేల్ జనవరి 19న Amazon.comలో జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

 

Best Mobiles in India

English summary
Top New Features in Lenovo Vibe K4 Note. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X