2020లో ఇండియాలో రిలీజ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు

|

2019 ఇయర్ ఎండ్ కు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున త్వరలో స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీలు మిగిలిన ఈ కొన్ని రోజులలో ఎటువంటి కొత్త ఫోన్ లను రిలీజ్ చేయడం లేదు. అయితే 2020 ప్రారంభంలో లాంచ్ చేయబోయే కొన్ని ముఖ్యమైన ఫోన్‌ల విషయానికి వస్తే ప్రముఖ చైనా కంపెనీ షియోమి తన రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ను 2020 Q1 లో విడుదల చేయనున్నది.

రియల్‌మి
 

అలాగే రియల్‌మి X50 లాంచ్ ఈవెంట్ జనవరి 2020 లో జరుగనున్నది. వన్‌ప్లస్ ఇప్పటికే తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ తయారీ కోసం పనిచేస్తోంది. దీని నుండి రాబోయే వన్‌ప్లస్ 8 సిరీస్ 2020 Q2లో ఇండియాలో రిలీజ్ కాబోతున్నది.

యూట్యూబ్‌లో 2019 లో అధిక వ్యూస్‌లను సాధించిన వీడియోలు

స్మార్ట్‌ఫోన్

శామ్సంగ్ తన గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ S11 మరియు గెలాక్సీ S10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా 2020లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మూడు శామ్సంగ్ యొక్క ఈ ఫోన్లు కొంతకాలంగా ఇండియాలో రిలీజ్ అవ్వబోతున్నట్లు చర్చగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారులే కాకుండా ఒప్పో, హువాయి వంటి ఇతర బ్రాండ్లు కూడా తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. 2020 లో లాంచ్ కానున్న టాప్ ఫోన్‌ల జాబితాను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

2019 లో U.S ఆర్మీ యొక్క అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ

2020 క్యూ 2లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 లైట్, వన్ ప్లస్ 8 ప్రో లాంచ్

2020 క్యూ 2లో వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 లైట్, వన్ ప్లస్ 8 ప్రో లాంచ్

వన్‌ప్లస్ తన రెండవ వన్‌ప్లస్ 8 సిరీస్‌ను 2020 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుంది. లీకైన పుకార్ల ప్రకారం వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 లైట్ 6.4-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మరోవైపు ప్రో వేరియంట్‌లో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇవి ఆధునిక పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటాయి. ప్రో మరియు స్టాండర్డ్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

Realme PaySa యాప్‌తో ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లోకి రియల్‌మి

2020 క్యూ 1లో షియోమి రెడ్‌మి 9 లాంచ్
 

2020 క్యూ 1లో షియోమి రెడ్‌మి 9 లాంచ్

షియోమి తన రెడ్‌మి 9 స్మార్ట్‌ఫోన్‌ను 2020 క్యూ 1లో విడుదల చేయనున్నది. ఈ రెడ్‌మి ఫోన్‌ను మొదట చైనాలో తరువాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారు. షియోమి రెడ్‌మి 9 యొక్క లాంచ్ డేట్ ను ప్రస్తుతానికి ఇంకా వెల్లడించలేదు. రెడ్‌మి 9 మీడియాటెక్ హెలియో G70 SoC తో రన్ అవుతుంది. ఇందులో 6.6-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లే మరియు 4GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుందని సూచించింది.

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 11 సిరీస్ ఫిబ్రవరి 18 2020 న ప్రారంభం

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 11 సిరీస్ ఫిబ్రవరి 18 2020 న ప్రారంభం

శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఫిబ్రవరి 18 న శాన్ ఫ్రాన్సిస్కోలో విడుదల చేయనుంది. 2020 లో లాంచ్ చేయబోయే టాప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 11e, గెలాక్సీ ఎస్ 11 మరియు గెలాక్సీ ఎస్ 11 + అనే మూడు గెలాక్సీ ఎస్ 11 మోడళ్లను పరిచయం చేస్తున్నది. అదే కార్యక్రమంలో కంపెనీ గెలాక్సీ ఫోల్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆవిష్కరించవచ్చు. గెలాక్సీ ఎస్ 11 లో 108 మెగాపిక్సెల్ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్ ను కలిగి ఉంటుంది. అలాగే 9-ఇన్ -1 పిక్సెల్ బిన్నింగ్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది యుఎస్ మార్కెట్లో స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో ప్యాక్ చేయబడి వచ్చే అవకాశం ఉంది. శామ్సంగ్ యూరోపియన్ మార్కెట్లో ఎక్సినోస్ 990 చిప్‌సెట్‌ను చేర్చే అవకాశం ఉంది. ఈ రెండూ 5G మోడెమ్‌లతో రాబోతున్నట్లు సమాచారం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 11 ప్లస్ లో LG సంస్థ తయారుచేసిన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.

 2020 క్యూ 1లో హువాయి P40 లాంచ్

2020 క్యూ 1లో హువాయి P40 లాంచ్

2020 క్యూ 1 లో హువాయి సంస్థ యూరప్‌లో తన సరికొత్త హువాయి P40 సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ సిఇఒ రిచర్డ్ యు తెలిపారు. ఈ కొత్త హువాయి సిరీస్‌ను మార్చి 2020 లో విడుదల చేస్తున్నారు. హువాయి P40 సిరీస్ స్మార్ట్ ఫోన్ 120HZ రిఫ్రెష్‌ రేట్ తో గల డిస్ప్లే ను కలిగి ఉంటుంది. హువాయి P40 సిరీస్ ఫోన్ 6.57-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్ తో రన్ అవుతుంది. ఇది హువాయి యొక్క శక్తివంతమైన అంతర్గత కిరిన్ 990 SoCతో వస్తుంది. అలాగే ఆఫర్‌లో 12 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఆపిల్ కు పోటీగా రియల్‌మి ఎయిర్‌పాడ్స్

2020 క్యూ 1(జనవరి) లో రియల్‌మి X50 లాంచ్

2020 క్యూ 1(జనవరి) లో రియల్‌మి X50 లాంచ్

2020 లో అన్నిటి కంటే ముందుగా రియల్‌మి ఎక్స్ 50 లాంచ్ ఈవెంట్ జనవరి 2020 లో జరుగుతుంది. అయితే రియల్‌మి ఎక్స్ 50 5Gని 2019 చివరికి ముందే లాంచ్ చేయాలని బ్రాండ్ యోచిస్తున్నట్లు గత నివేదికలు సూచిస్తున్నాయి. 5G కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం . ఈ హ్యాండ్‌సెట్ 6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటుగా VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 టెక్, ఆండ్రాయిడ్ 10 మరియు స్నాప్‌డ్రాగన్ 765 SoC తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Upcoming Smartphones to Launch in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X