Home
Mobile

బెస్ట్‌ కెమెరాల ఫోన్‌ కోసం చూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌.. ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ కెమెరాలతో వివో మిడ్‌రేంజ్‌ ఫోన్..

Vivo T4 Pro 5G Smartphone : వివో సంస్థ ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే వివో T4 సిరీస్‌లో భాగంగా వివో T4, T4 లైట్‌, T4x 5G, T4 అల్ట్రా, T4R స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. మరియు వివో V60 ఫోన్‌ కూడా లాంచ్ అయింది. అయితే త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. వివో T4 ప్రో 5G పేరుతో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక కీలక వివరాలు వెల్లడయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ ద్వారా :
వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అనంతరం ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. తాజాగా ఈ ఫోన్ కెమెరా డిజైన్‌, ధర సహా ఇతర కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ఆధారంగా ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్‌ లెవల్‌ 3x పెరిస్కోప్‌ జూమ్‌ ను కలిగి ఉంటుంది.

Vivo T4 Pro 5G smartphone confirmed to launch soon in india

కెమెరా విభాగం పరంగా :
Smartprix రిపోర్టు ఆధారంగా వివో స్మార్ట్‌ఫోన్‌ సోనీ IMX882 సెన్సర్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. V60, X200 FE ఫోన్‌లలో ఈ సెన్సర్‌నే ఉపయోగించారు. దీంతోపాటు ఈ ఫోన్ 7.53mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మరియు క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.74 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 5700mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎంత ధరలో విడుదల కానుంది :
భారత్ మార్కెట్‌లో వివో T4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.30 వేల ధర రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు బ్లేజ్‌ గోల్డ్‌, నిట్రో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ కానుందని అంచనా వేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

V60 5G స్మార్ట్‌ఫోన్‌ :
వివో నుంచి ఇటీవలే V60 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్‌ Zeiss భాగస్వామ్యంతో కూడిన కెమెరాలను కలిగి ఉంది. మరియు 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ వివో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 4 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP సోనీ IMX766 ప్రైమరీ కెమెరా (OIS), 50MP సోనీ IMX882 టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Take a Poll

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.36999 గా ఉంది. ఆగస్టు 19 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. వివో ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆస్పీషియస్‌ గోల్డ్‌, మిస్ట్‌ గ్రే, మూన్‌లిట్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo T4 Pro 5G smartphone confirmed to launch soon india here are the leaked specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X