రూ.13999 కే 6500mAh భారీ బ్యాటరీ, 6.72 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా Vivo 5G స్మార్ట్‌ఫోన్..!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత్ ఎంతో కీలకం. ముఖ్యంగా బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ అనుకూలతను అవకాశంగా తీసుకొని స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు సరికొత్త డిజైన్, ఫీచర్‌లతో ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్‌లో శాంసంగ్ చురుగ్గా ఉంది. ఎంట్రీ, బడ్జెట్ రేంజ్‌లో నాలుగైదు ఫోన్లను లాంచ్ చేసింది. అయితే ఇటీవల వివో మిడ్ రేంజ్ ధరలో అదిరిపోయే డిజైన్‌లో వివో V50 హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. సేల్ కూడా ప్రారంభం అయింది.
తాజాగా భారత్ మార్కెట్‌లో రూ.15,000 కంటే తక్కువ ధరలో వివో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో T4x 5G పేరుతో (Vivo T4x 5G Smartphone Launched) ఇవాళ లాంచ్ అయింది. ఈ ఫోన్ భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ధరలో అందుబాటులోకి ఉన్న ఇతర మోడళ్లకు గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది.

వివో T4x 5G ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. భారీ బ్యాటరీ, ఈ సెగ్మెంట్‌లో శక్తివంతమైన చిప్‌సెట్, మిలిటరీ గ్రేడ్ తో వచ్చింది. డిజైన్ పరంగానూ ఆకట్టుకుంటుంది. కింద పడినా డ్యామేజీ కాకుండా ఉండేలా డిజైన్ చేశారు. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
వివో T4x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1050 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా రూపొందించారు.

చిప్‌సెట్ :
ఈ వివో బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS (Skin) ను కలిగి ఉంది.
స్టోరేజీ వేరియంట్స్ :
ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందనుందని వివో తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 258GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ వివో హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP కెమెరాను అమర్చారు. f/2.4 అపేచర్‌తో 2MP బొకేష్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.05 అపేచర్‌తో 8MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరా యూనిట్ AI ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. వెనుక వైపు డైనమిక్ లైట్ రింగ్‌ను అందించారు.
భారీ బ్యాటరీ :
ఈ వివో T4x 5G ఫోన్ 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ మెరుగైన ఆడియో కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. గేమింగ్ కోసం 4D గేమ్ వైబ్రేషన్ ఫీచర్‌ను అమర్చారు. 5G, 4G సిమ్ కార్డులను సపోర్టు చేస్తుంది.

వివో T4x 5G ఫోన్ ధర, సేల్ వివరాలు :
ఈ ఫోన్ 6GB/128GB వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. 8GB/128GB వేరియంట్ ధర రూ.14,999, 8GB/256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. మార్చి 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది.
వివో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, SBI, Axis బ్యాంకుల కార్డులతో రూ.1000 డిస్కౌంట్‌ను (Vivo T4x 5G smartphone Sale in india) పొందవచ్చు. ఈ ఫోన్ మెరైన్ పర్పుల్, ప్రాంటో పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో భారత్ మార్కెట్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








