Home
Mobile

50MP + 50MP + 50MP కెమెరాలు, 6000mAh బ్యాటరీ Vivo 5G ఫోన్‌ సేల్‌ ప్రారంభం.. 10% డిస్కౌంట్‌!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి గత వారం వివో V50 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకట్టుకుంటోంది. నాణ్యమైన కెమెరాలను కలిగి ఉంది. మరియు 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఇవాళ్టి నుంచి సేల్‌ (Vivo V50 Smartphone Sale) ప్రారంభం అయింది. తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా ఏకంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

బెస్ట్ కెమెరాలు, భారీ డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు సహా క్వాడ్‌ కర్వడ్ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ అందుబాటులో వచ్చింది. ముఖ్యంగా ఈ ఫోన్‌ డిజైన్‌ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు ఎక్కువ రోజులపాటు ఎన్నిక వచ్చేలా వివో ప్రత్యేక చర్యలు తీసుకుంది. మెరుగైన వాటర్ రిసిస్టెంట్‌గా ఉంది.

Vivo V50 Smartphone sale

వివో ఫోన్‌ స్టోరేజీ, ధర వివరాలు :
వివో V50 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.40,999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను వివో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది.

తొలి సేల్‌లో భాగంగా HDFC, ICICI, SBI బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్‌లు రూ.1899 విలువైన Vivo TWS 3e ఇయర్‌బడ్స్‌ను రూ.1499 కే కొనుగోలు చేయవచ్చు. క్రోమా, రిలయన్స్ డిజిటల్‌, క్రోమా వంటి ప్లాట్‌ఫాం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రోజ్‌ రెడ్‌, స్టార్రీ బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తోంది.

Vivo V50 Smartphone sale

వివో V50 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వివో స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌. 1080*2392 పిక్సల్స్‌ రిజల్యూషన్, 387 ppi పిక్సల్స్‌ డెన్సిటీని కలిగి ఉంది.

50MP + 50MP+ 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ZEISS భాగస్వా్మ్యంతో f/1.88 అపేచర్‌, OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపేచర్‌తో 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అమర్చి ఉంది. దీంతోపాటు f/2.0 అపేచర్‌తో 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక వైపు Aura లైట్‌ ఫీచర్‌ను అమర్చారు. AI లైట్‌ పొర్ట్రెయిట్‌ 2.0, Erase 2.0 ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.

చిప్‌సెట్, OS వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత లైవ్‌ కాల్‌ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టూ సెర్చ్‌, ట్రాన్స్‌స్క్రిప్ట్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్‌లున్నాయి. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

6000mAh బ్యాటరీ :
బ్యాటరీ పరంగా ఈ వివో 5G హ్యాండ్‌సెట్ 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, ‌బ్లూటూత్ 5.4, WiFi, GPS, OTG, USB-C 3.2 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ IP68 + IP69 రేటింగ్‌తో కూడిన డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V50 Smartphone sale is live in india get 10 percent discount on selected bank cards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X