వివో V17 రిలీజ్.... దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూడండి
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ఇప్పుడు ఇండియాలో తన కొత్త వివో V17 ను న్యూ డిల్లీలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన కార్యక్రమంలో విడుదల చేసింది. ఏ లాంచ్ ఈవెంట్ ను వివో సంస్థ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రసారం చేసింది.

వివో V 17 స్మార్ట్‌ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా మరియు 48MP బ్యాక్ కెమెరా సెటప్ తో మరియు 4500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వచ్చింది. మిగిలిన వివరాల కోసం ముందుకు చదవండి.

ధరల వివరాలు
సెప్టెంబరులో లాంచ్ చేసిన వివో V17 ప్రో మాదిరిగా వివో V17 కూడా కేవలం ఒకే ఒక స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ గల దీని ధర రూ.22,990. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, వివో యొక్క ఇ-స్టోర్ మరియు ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ను డిసెంబర్ 17, 2019 నుండి కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్
వివో వి 17 స్మార్ట్‌ఫోన్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండి పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ మద్దతుతో వస్తుంది. ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కలిగి ఉండి 6.00-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే 2400 x 1080 పిక్సెల్స్ నిర్మాణంలో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి బయోమెట్రిక్ యాక్సిస్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఇది 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. ఇది హైబ్రిడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు మెమోరిని విస్తరించవచ్చు. వివో వి 17 తో వినియోగదారులు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్న పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా విభాగానికి వస్తే వెనుకవైపు వివో వి 17 స్మార్ట్ ఫోన్ 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇది విస్తృత ఎఫ్ / 1.8 ఎపర్చరు మరియు పేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ ఫీచర్ ను అందిస్తుంది. ఇది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ పై ఆధారంగా ఫన్‌టచ్ OS9.2 తో రన్ అవుతుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








