ఆఫ్‌లైన్ దుకాణాలలో గొప్ప ఆఫర్లతో Vivo U20 స్మార్ట్‌ఫోన్ 8GB RAM వేరియంట్‌

|

వివో సంస్థ త్వరలో ఇండియాలో వివో U20 స్మార్ట్‌ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నది. వివో U20 స్మార్ట్‌ఫోన్ యొక్క 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌ను డిసెంబర్ 12 న విడుదల చేయనున్నది. అయితే ఈ కొత్త మోడల్‌కు సంబంధించి వివో ఇంకా ఎటువంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు. ఇప్పుడు వివో U20 యొక్క కొత్త మోడల్ ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా రూ.17,900 ధర వద్ద లభిస్తుందని పేర్కొంది.

ఆఫ్‌లైన్

వివో బ్రాండ్ ఇటీవల తన వివో U20 స్మార్ట్‌ఫోన్ ను 4 జిబి ర్యామ్ మరియు 6 జిబి ర్యామ్ ఆప్షన్లతో ఇండియాలో విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లు అమెజాన్ ఇండియా మరియు వివో యొక్క ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌లైన్ దుకాణాలలో కూడా అందుబాటులోకి రానున్నది.

ధరల వివరాలు

ధరల వివరాలు

వివో U20 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇండియాలో వీటి ధరల వివరాలు వరుసగా బేస్ మోడల్ 4 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.10,990. అలాగే 6 జిబి RAM + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ.11,990. వివో యొక్క తాజా ఫోన్ రేసింగ్ బ్లాక్ మరియు బ్లేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇప్పుడు 8 జీబీ ర్యామ్+128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.17,900.

 

BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్BSNL నుంచి మూడు STV ప్లాన్‌లు అవుట్

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ స్లాట్ గల వివో U20 ఆండ్రాయిడ్ పై మరియు ఫన్‌టచ్ OS 9 కస్టమ్ స్కిన్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 6.53-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080 x 2340 పిక్సెల్స్) డిస్ప్లే 90.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ వైడ్విన్ L1 ధృవీకరణను పొందినట్లు వివో పేర్కొంది. అంటే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలను అధిక రిజల్యూషన్ కంటెంట్‌తో ఆస్వాదించవచ్చు. వివో U20 ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 SoCను కలిగి ఉండి 6GB వరకు గల RAM తో జతచేయబడి ఉంటుంది.

కెమెరా

ఫోన్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది సోనీ IMX499 సెన్సార్ మరియు f / 1.8 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ గల మెయిన్ కెమెరా ద్వారా హైలైట్ చేయబడుతుంది. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ కెమెరా వైడ్-యాంగిల్ సెన్సార్, ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 120-డిగ్రీల వీక్షణ క్షేత్రంతో వస్తుంది. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఎఫ్ / 2.4 ఎపర్చరుతో వస్తుంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ

వివో U 20 స్మార్ట్ ఫోన్ 64 జిబి వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీను 256 జిబి వరకు ద్వారా విస్తరించే సదుపాయం కూడా ఉంది. వివో U20 లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, వై-ఫై, బ్లూటూత్ 5.0, GPS , BeiDou, GLONASS మరియు గెలీలియో ఉన్నాయి. ఫోన్ లోపల ప్యాక్ చేయబడిన సెన్సార్లు యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, సామీప్య సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్ మరియు యాక్సిస్ కోసం వెనుక-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Vivo Set To Launch U20's 8GB RAM Variant on December 12

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X