Vivo V19: వివో కొత్త ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి...

|

కరోనా వైరస్ కారణంగా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు చాలా రోజుల నుంచి తమ యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ లను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒకొక్క కంపెనీ తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. నిన్ని షియోమి సంస్థ తన Mi 10 ను విడుదల చేసింది.

వివో V19

వివో V19

ఈ రోజు ఇండియాలో మరొక రెండు సంస్థలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసారు. ఇందులో వివో సంస్థ యొక్క వివో V19 మరియు హానర్ సంస్థ యొక్క హానర్ 9X స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వివో V17 యొక్క అప్ డేట్ వెర్షన్ గా అందుబాటులోకి వచ్చిన వివో V19 చాలా వాయిదాల తరువాత ఎట్టకేలకు ఈ రోజు ఇండియాలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ను మొదట మార్చి చివరలో లాంచ్ చేయాలనీ భావించినప్పటికీ లాక్డౌన్ కారణంగా లాంచ్ చేయలేక పోయారు. వివో V19 స్మార్ట్‌ఫోన్ కూడా మిడ్-రేంజ్ విభాగంలో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వస్తోంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో వివో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. మిడ్-రేంజ్ విభాగంలో ప్రజాదరణ పొందిన విభాగంలో వివో సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్లు ముందు వరుసలో ఉన్నాయి.

వివో V19 యొక్క ధర మరియు లభ్యత వివరాలు
 

వివో V19 యొక్క ధర మరియు లభ్యత వివరాలు

వివో V19 శక్తివంతమైన కెమెరా ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదల అయింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో కూడిన బేస్ మోడల్ యొక్క ధర రూ.27,990 కాగా టాప్-ఎండ్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.31,990 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క మొదటి అమ్మకాలు మే 15 నుండి అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్ మరియు ఇతర ప్రధాన రిటైలర్ల ద్వారా మొదలు కానుంది.

వివో V19 స్పెసిఫికేషన్స్

వివో V19 స్పెసిఫికేషన్స్

వివో V19 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC చేత రన్ అవుతూ 8GB ర్యామ్‌తో మరియు 128GB లేదా 256GB స్టోరేజ్ల‌తో జతచేయబడి వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత వివో ఫన్‌టచ్ OS 10 తో రన్ అవుతుంది. ఇది పియానో బ్లాక్ మరియు మిస్టిక్ సిల్వర్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది. ఇది చాలా భిన్నమైన ముగింపుతో దాదాపుగా గాజు రూపాన్ని ఇస్తుంది.

వివో V19 కెమెరా సెటప్

వివో V19 కెమెరా సెటప్

వివో V19 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ఇమేజింగ్ కోసం క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్ సెకండ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో మూడు,నాలుగు కెమెరాలు జత చేయబడి ఉంటాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.1 ఎపర్చర్‌తో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో సెకండరీ లెన్స్ జత చేయబడి ఉంటాయి. ఇది 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

వివో V19 కనెక్టివిటీ

వివో V19 కనెక్టివిటీ

వివో V19 స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలో ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ మద్దతుతో వస్తుంది. ఇది 5G కనెక్టివిటీకి మద్దతు ఇవ్వదు. ఇది డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5 మరియు Wi-Fi 802.11ac కు మద్దతు ఇవ్వగలదు. పరికరంలో యుఎస్‌బి టైప్-సి పోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే ఫన్‌టచ్ ఓఎస్ 10 తో స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది.

Best Mobiles in India

English summary
Vivo V19 Smartphone Launched In India: Price, Specs, Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X