Xiaomi Mi 10 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్... ధరల మీద ఓ లుక్ వేయండి...

|

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఈ రోజు ఇండియాలో తన సరికొత్త Mi10 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇండియాలో Mi10 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా Mi బాక్స్ మరియు Mi వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను కూడా విడుదల చేసింది.

Mi10 5G

108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 865 SoC, 90Hz డిస్ప్లే, 30W ఫాస్ట్ ఛార్జ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న Mi10 5G స్మార్ట్‌ఫోన్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి Mi10 5G స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

షియోమి Mi10 5G స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

భారతదేశంలో షియోమి Mi 10 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఇందులో 8GB LPDDR5 ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.49,999. మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.54,999. వీటిని కొనుగోలు చేయడానికి ప్రస్తుతం వీటిని ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంచింది.

ప్రీ-బుకింగ్ ఆఫర్స్ వివరాలు

ప్రీ-బుకింగ్ ఆఫర్స్ వివరాలు

షియోమి యొక్క వెబ్ సైట్ మరియు అమెజాన్ ద్వారా వీటి అమ్మకాలు మొదలుకానున్నాయి. ఇప్పుడు షియోమి Mi10 5G ను ముందస్తు ఆర్డర్ చేసిన వారికి Mi యొక్క వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లను ఉచితంగా పొందే అవకాశం ఉంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులను వినియోగించి ముందుగా ఆర్డర్ చేసిన వారికి రూ.3 వేల వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అలాగే దీని కొనుగోలు మీద నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

షియోమి Mi 10 5G స్పెసిఫికేషన్స్

షియోమి Mi 10 5G స్పెసిఫికేషన్స్

కొత్తగా లాంచ్ అయిన షియోమి Mi 10 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 3D కర్వడ్ అమోలెడ్ ట్రూ కలర్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ HDR10 +, FHD + రిజల్యూషన్, DCI-P3 కలర్ మరియు 1120nits గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇస్తుంది. ఇది మైక్రోడాట్-నాచ్డ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ప్యానెల్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తుంది. అలాగే దీని యొక్క డిస్ప్లే 5000000: 1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5G మద్దతును కలిగి ఉండి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ మరియు అడ్రినో 650 జిపియుతో జతచేయబడి ఉంటుంది. ఇది వేడిని వెదజల్లడానికి లిక్విడ్ కూల్ 2.0 ఆవిరి ఛాంపర్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

 

 

 

WhatsApp వీడియో కాల్స్ ను Windows PC నుండి చేయడం ఎలా?WhatsApp వీడియో కాల్స్ ను Windows PC నుండి చేయడం ఎలా?

కెమెరా ఫీచర్స్

కెమెరా ఫీచర్స్

షియోమి Mi 10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి దాని రియర్ కెమెరా సెటప్. ఈ ఫోన్ యొక్క వెనుకవైపు మొత్తంగా నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా శామ్సంగ్ యొక్క ఐసోసెల్ బ్రైట్ హెచ్‌ఎంఎక్స్ సెన్సార్‌తో 108 మెగాపిక్సెల్ తో వస్తుంది. దీని రియర్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్, OIS, EIS సెన్సార్‌ల మద్దతు కూడా ఉన్నాయి. దీని ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియోల కోసం 20 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ప్రో వీడియో రికార్డింగ్ మోడ్, నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, రా మోడ్ వంటి మరెన్నో ఫీచర్లను కూడా కలిగి ఉంది.

షియోమి Mi 10 5G కనెక్టివిటీ

షియోమి Mi 10 5G కనెక్టివిటీ

షియోమి Mi 10 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జిపిఎస్, హై-రెస్ ఆడియో, NFC మరియు ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్ ఉన్నాయి. ఈ ఫోన్ 4,780mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. Mi 10 30W వైర్డ్ టర్బో ఛార్జ్ టెక్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. ఇది హోమ్ వైర్‌లెస్ నెట్‌వర్క్‌లకు సమానమైన వై-ఫై 6 కి మద్దతును అందిస్తుంది. ఇది వై-ఫై 802.11ac యొక్క అప్ డేట్ వెర్షన్.

Best Mobiles in India

English summary
Xiaomi Mi 10 5G Smartphone Launched in India : Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X