వివో కొత్త ఫోన్ కీలక వివరాలు లీక్.. 50MP సోనీ కెమెరా. భారీ బ్యాటరీ సహా ఎన్నో ఫీచర్‌లు..!
వివో నుంచి గత నెలలో V50 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ పరంగా ఆకట్టుకుంది. మరియు మెరుగైన ఫీచర్‌లను కలిగి ఉంది. మూడు 50MP కెమెరాలతోపాటు, 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మరియు మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే వివో నుంచి మరో మోడల్ త్వరలో విడుదల కానుంది. వివో V50e పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
BIS వెబ్‌సైట్‌లో :
వివో V50e స్మార్ట్‌ఫోన్ (Vivo V50e Smartphone) గురించి ఇటీవలే కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని లీక్స్ వచ్చాయి. దీంతోపాటు ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫలితంగా భారత్‌లో లాంచ్ కానుందని స్పష్టం అయింది.

డిజైన్ వివరాలు లీక్ :
ఈ వివో కొత్త హ్యాండ్‌సెట్ గీక్‌బెంచ్ లోనూ లిస్టింగ్ అయింది. ఈ లిస్టింగ్ ఆధారంగా ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. 91మొబైల్స్ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అంచనా స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 నుంచి రూ.30,000 మధ్య ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా వివో V50e హ్యాండ్‌సెట్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తోపాటు 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ఆధారంగా వివో కొత్త హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుందని సమాచారం.
రెండు 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందువైపు 50MP కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్ 90W ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. IP68+ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన స్పెసిఫికేషన్లు, ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో V50 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది. 90W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
మరియు ఈ ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP + 50MP వెనుక కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








