Home
Mobile

ఆకట్టుకొనే డిజైన్‌, క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, 50MP సెల్ఫీ కెమెరా, IP68+ IP69 రేటింగ్‌తో వివో V50e ఫోన్‌!

వివో నుంచి ఇండియా మార్కెట్‌లోకి ఇటీవల వివో V50 5G, వివో T4x 5G, వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. అయితే వివో నుంచి త్వరలో V50e స్మార్ట్‌ఫోన్‌, వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. అయితే తాజాగా V50e స్మార్ట్‌ఫోన్ వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ కచ్చితంగా ఎప్పుడు లాంచ్ కానుందనే వివరాలు వెల్లడి కాలేదు.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే తాజాగా వివో సంస్థ ఈ ఫోన్ గురించి కీలక వివరాలను వెల్లడించింది. కొన్ని సెకన్ల వీడియోను (Vivo V50e Smartphone Teased) విడుదల చేసింది. ఈ ఫోన్ త్వరలో విడుదల కానుందని తెలిపింది. మరియు కొన్ని డిజైన్ వివరాలు వెల్లడయ్యాయి.

vivo V50e

క్వాడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లే :
ఈ హ్యాండ్‌సెట్‌ స్లిమ్ ప్రొఫైల్‌ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ శాండ్‌ టెక్చర్‌ మరియు గ్లాస్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ఈ వివో V50e ఫోన్‌ కర్వడ్‌ ఫ్రేమ్‌, ఎడ్జ్‌లను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

50MP సెల్ఫీ కెమెరా :
ఈ ఫోన్ వివో V సిరీస్‌ తరహాలోనే Pendulum స్టైల్‌ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, మరో అల్ట్రావైడ్‌ సెన్సార్‌ తో లాంచ్ కానుంది. ఈ ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంటుంది.

vivo V50e

ఈ ఫోన్‌ ముందు, వెనుక కెమెరాల ద్వారా 4K రిజల్యూషన్‌ తో వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు ఈ ఫోన్‌ అండర్‌ వాటర్ ఫోటోగ్రఫీ ఫీచర్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ సర్కిల్‌ టూ సెర్చ్‌, Image Expender, మేజిక్ ఎరేజర్‌, ట్రాన్‌క్రిప్ట్ అసిస్ట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో ప్రారంభ ధర రూ.30000 కంటే తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్‌ వివో ఇండియా, అమెజాన్‌ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ రెండో వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

మెరుగైన వాటర్‌, డస్ట్ రెసిస్టెంట్‌ :
వివో V50e స్మార్ట్‌ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో మెరుగైన డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ టోన్‌ పర్పుల్‌, వైట్ ఫినిష్‌ మరియు సఫైర్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. మరియు Aura లైట్‌ ను కూడా కలిగి ఉంటుంది.

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివో V50 స్మార్ట్‌ఫోన్ 6.77 అంగుళాల క్వాడ్ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. 90W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ ఫోన్‌ 50MP + 50MP వెనుక కెమెరాలతోపాటు 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.34,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ రూ.36,999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.40,999 గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
vivo V50e smartphone teased in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X