Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 6 సంవత్సరాల అప్‌డేట్స్‌తో Vivo 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Vivo V70 Elite Smartphone : వివో V70 సిరీస్‌ ఇవాళ భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయింది. ఇందులో భాగంగా వివో V70, వివో V70 ఇలైట్‌ మోడల్స్‌ లాంచ్ అయ్యాయి. ఇలైట్‌ మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. 50MP సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇవాళ్టి నుంచే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 5000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 459 ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

Vivo V70 Elite Smartphone features

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్ ఆక్టాకోర్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ Zeiss భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలున్నాయి. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, OIS సపోర్టుతో 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉన్నాయి.

Vivo V70 Elite Smartphone features

50MP సెల్ఫీ కెమెరా, 6500mAh బ్యాటరీ :
సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 90W ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, GPS, NFC, QZSS, NavlC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు IR బ్లాస్టర్‌, యాక్సెలిరోమీటర్, ఇ-కంపాస్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌, కలర్‌ టెంపరేచర్‌ సెన్సర్, యాంబియంట్ లైట్‌ సెన్సర్‌లు ఉన్నాయి. భద్రత కోసం 3D అల్ట్రాసోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.

వివో V70 ఇలైట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.51999 గా ఉంది. 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.56999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.61999 గా ఉంది. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని వివో తెలిపింది.

ఈ ఫోన్ సేల్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది. SBI, HDFC, యెస్‌ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇలైట్ మోడల్‌ ఫోన్‌ శాండ్ బీజ్‌, ప్యాషన్‌ రెడ్, అథెంటిక్ బ్లాక్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. వివో ఆన్‌లైన్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Vivo V70 Elite Smartphone launched with Snapdragon 8s gen 3 Chip in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X