200MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో 5G స్మార్ట్‌ఫోన్..?
భారత్ మార్కెట్ లో వివో నుంచి ఈ నెలలో Y51 ప్రో మోడల్ విడుదల అయింది. గత నెలలో వివో V70 సిరీస్ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా V70, V70 ఇలైట్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. మెరుగైన కెమెరాలు, ఆకట్టుకొనే డిజైన్‌తో ఈ ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సిరీస్ నుంచి త్వరలో మరో ఫోన్ విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ వివరాలు లీక్ అయ్యాయి.
కీలక వివరాలు లీక్! :
వివో V70 FE స్మార్ట్‌ఫోన్ (Vivo V70 FE Smartphone) ఇటీవలే గ్లోబల్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చింది. భారత్ లోనూ ఇదే మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లతోపాటు ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (Smartprix) ఈ వివరాలు లీక్ చేశారు.

1.5k అమోలెడ్ డిస్‌ప్లే :
వివో V70 FE స్మార్ట్‌ఫోన్ భారత్ వేరియంట్ గ్లోబల్ వేరియంట్ తరహా ఫీచర్లనే కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ గ్లోబల్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 5 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని హామీ ఇచ్చింది.
200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 200MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చి ఉంది. 90W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
మిడ్‌రేంజ్ ధరలో :
భారత్ మార్కెట్ లో ఈ ఫోన్ రూ.30 వేల నుంచి రూ.40 వేల ధర రేంజ్ లో అందుబాటులోకి వస్తుందని టిప్‌స్టర్ తెలిపారు. ఇటీవల విడుదల అయిన V70 ఫోన్ ప్రారంభ ధర రూ.45999, V70 ఇలైట్ మోడల్ ధర రూ.51999 గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మాన్‌సూన్ బ్లూ, నార్తన్ లైట్స్ పర్పుల్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వివరాలపై వివో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
వివో నుంచి ఇటీవల వివో Y51 ప్రో 5G విడుదల అయింది. ప్రారంభ ధర రూ.24999 గా ఉంది. 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 50MP కెమెరా, 7200mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications










