200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16 OS తో వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల
Vivo X300 Pro Smartphone : వివో X300 సిరీస్ ఇవాళ భారత్ మార్కెట్‌లో విడుదల అయింది. ఇందులో భాగంగా వివో X300, వివో X300 ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ సహా అనేక బెస్ట్ ఫీచర్‌లు ఉన్నాయి. ఈ వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల 1.5K LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 452 ppi పిక్సల్ డెన్సిటీను కలిగి ఉంది. దీంతోపాటు HDR10+, TUV Rheinland ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్, SGS Low బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.

అల్యూమినియం ఫ్రేమ్ :
ఈ ఫోన్ అల్యూమినియం అల్లాయ్ మిడ్ ఫ్రేమ్ ను కలిగి ఉంది. ముందువైపు గ్లా్స్, వెనుక వైపు గ్లా్స్ ఫైబర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఇలైట్ బ్లాక్, డూన్ గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
7 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ వివో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్ 16GB LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పైన పనిచేస్తుంది. 5 ఆండ్రాయిడ్ OS, 7 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

200MP టెలిఫోటో లెన్స్ :
కెమెరా విభాగం పరంగా Zeiss భాగస్వామ్యంతో వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ LYT 828 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో లెన్స్, 50MP వైడ్ యాంగిల్ JN1 సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాను అమర్చారు.
6510mAh బ్యాటరీ :
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ 90W వైర్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 6510mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, వైఫై, బ్లూటూత్, GPS, NFC, USB-C సహా అనేక ఫీచర్‌లు ఉన్నాయి. దీంతోపాటు ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్‌లు ఉన్నాయి.
వివో X300 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,09,999 గా ఉంటుంది. ఇవాళ్టి నుంచే ఈ ఫోన్‌ను ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది.
ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 10 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వివో ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. వివో టెలిఫోటో ఎక్స్‌టెండర్ కిట్ రూ.18999 ధరకు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








