6500mAh భారీ బ్యాటరీతో Vivo మరో 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP సోనీ HD కెమెరా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వివో నుంచి బడ్జెట్ రేంజ్‌లో వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ను (Vivo Y39 5G Smartphone Launched) విడుదల చేసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఫోన్ భారత్‌లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, SGS సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇటీవల విడుదల అయిన వివో T4x 5G ఫోన్ కూడా 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వివో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. దీంతోపాటు వర్చువల్‌గా 8GB వరకు ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం ఉంది. స్టోరేజీని పెంచుకొనే అవకాశం లేదు.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని వివో హామీ ఇచ్చింది. ఈ ఫోన్ 8GB/128GB, 8GB/256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్ అయింది.
AI ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ AI Erase, AI Photo Enhance ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు కాలింగ్ సమయంలో ఆడియో క్వాలిటీని మెరుగుపరిచేందుకు AI ఆడియో అల్గారిథం సాయం చేస్తుంది. దీంతోపాటు సర్కిల్ టూ సెర్చ్ (Circle to Search) మరియు Gemini వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

డిస్‌ప్లే వివరాలు :
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.68 అంగుళాల (720*1608 పిక్సల్స్ ) LCD డిస్‌ప్లేతో లాంచ్ అయింది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 264 ppi పిక్సల్ డెన్సిటీని కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు హాని జరగకుండా ఉండేందుకు Rheinland ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ HD కెమెరా, 2MP బోకేష్ కెమెరాను అమర్చారు. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది.
6500mAh బ్యాటరీ :
ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ అయింది. 44W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, వైఫై, బ్లూటూత్ 5.0, GPS వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్ (Vivo Y39 5G Sale) 8GB ర్యామ్వ+ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16999 గా ఉంది. 8GB ర్యామ్వ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999 గా ఉంది. వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వివో Y39 5G స్మార్ట్‌ఫోన్‌ను SBI కార్డు, యాక్సెస్ బ్యాంకు, DBS, యెస్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, BOB కార్డు పై రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఏప్రిల్ 6 వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఓషియన్ బ్లూ, లోటస్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








