రోజుకు 5 గంటలు స్మార్ట్‌ఫోన్‌తోనే కాలం

Written By:

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా...వాడుతుంటే రోజుకు ఎన్ని గంటలు స్మార్ట్ ఫోన్ తో గడుపుతున్నారు. అసలు సెల్ ఫోన్ ఉన్నవారు దాంతో ఎంత టైం గడుపుతున్నారు. ఇలాంటి అంశాలపై ఓ అధ్యయనం నిర్వహించారు. అయితే ఆ అధ్యయనంలో కొన్ని ఆస్తక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ విషయాలేంటో ఓ సారి చూద్దాం.

Read more : అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌ కూడా ఓ నిత్యావసర వస్తువు..

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ కూడా ఓ నిత్యావసర వస్తువు అయిపోయింది. రోజుకు సగటున ఐదు గంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లోనే గడుపుతున్నారు. ఇది మనిషి మేలుకువ ఉండే సమయంలో మూడో వంతు.

రోజుకు సగటున 82సార్లు ..

రోజుకు సగటున 82సార్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను చెక్ చేసుకుంటున్నారు. ఈ వివరాలు తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి.

18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సున్న 23 మందిపై..

స్మార్ట్‌ఫోన్లపై రోజుకు ఎంత సమయం గడుపాలనుకుంటున్నారా? వాస్తవానికి ఎంతసేపు ఉంటున్నారు? అనేదానిపై 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సున్న 23 మందిపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు.

తాము అనుకున్న దానికన్నా రెండురెట్లు అధికంగానే..

అయితే, తాము అనుకున్న దానికన్నా రెండురెట్లు అధికంగానే ప్రజలు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారని ఈ అధ్యయనం తేలింది.

సెల్‌ఫోన్‌ వినియోగాన్ని అంచనా వేయడంలో వారు..

మొబైల్ ఫోన్ వినియోగం విషయమై సైకాలజిస్టులు సొంత సమాచార రిపోర్టులపై ఆధారపడుతుంటారని, సెల్‌ఫోన్‌ వినియోగాన్ని అంచనా వేయడంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని బ్రిటన్‌లోని లాంకేస్టర్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ ఎల్లిస్ తెలిపారు.

మొబైల్ ఫోన్‌ను తరచూ విపరీతంగా వాడటం..

మొబైల్ ఫోన్‌ను తరచూ విపరీతంగా వాడటం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అలవాటుగా మారినప్పటికీ.. ఒక పర్యాయంలో సాధారణంగా 30 సెకన్లకు మించి స్మార్ట్‌ఫోన్లపై గడపడం లేదని, టైం చూడటం, మెసెజ్, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు చెక్ చేయడం వంటివి మాత్రమే చేస్తున్నారని చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write We Use Smartphones for 5 Hours Each Day: Study
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot