నోకియా నుంచి మళ్లీ ఈ ఫోన్లు వస్తే..?

Written By:

నోకియా ఈ పదానికున్న బ్రాండ్ అంతా ఇంతా కాదు. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. అంతగా ప్రజల్లో కనెక్ట్ అయిన నోకియా అనుకోని కారణాలవల్ల తె వెనక్కి వెళ్లిపోయింది. అయితే వచ్చే ఏడాది గ్రాండ్ ఎంట్రీతో మేము మీ ముందుకొస్తున్నామంటూ ప్రకటించి అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది. అయితే నోకియా నుంచి వచ్చిన కొన్ని అరుదైన ఫోన్ల గురించి చాలామందికి తెలియదు.. సో అలాంటి వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఆపిల్ ఫోనేనా..? మతిపోగొడుతున్న ఐఫోన్ 8 ఎడ్జ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 7600

2003లో నోకియా 7600పేరుతో ఈ ఫోన్ రిలీజయింది. ఇది చూసేందుకు కన్నీటి చుక్కలాగా ఉంటుంది. రెండు చేతుల్లో ఇమిడిపోయే విధంగా ఉండే ఈఫోన్ అర్థం కూడా మీ రెండు చేతులతో ఎప్పుడైనా ఆ కన్నీటి చుక్కలను తుడుచుకోవచ్చు అని కూడా అర్థం అని అంటారు.

నోకియా 7280

లిపిస్టిక్ ఫోన్ అని పిలుచుకునే ఈ ఫోన్ 2005లో రిలీజ్ అయింది. విచిత్రమేమింటంటే ఇందులో కీ బోర్డ్ ఉండదు. పాత ఐ పాడ్స్ ఉపయోగించినట్లు ఉపయోగించాలి. అయితే ఇది ఫోన్ గా అంత సూట్ కాదు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 3650

మ్యాజికల్ సర్కులర్ కీ ప్యాడ్ తో వచ్చిన ఫోన్. కన్నీటి చుక్క ఫోన్ కు ముందు వచ్చిన ఫోన్ ఇది. 2002లో రిలీజయింది. చాలా స్మార్ట్ గా సింబారియన్ సీరిస్ 60లో ఉంటుంది.

నోకియా ఎన్90

వీడియో కెమెరాతో 2005లో దూసుకొచ్చి సంచలనం రేపిన ఫోన్ ఇది. 2 ఎంపీ కార్ల్ జెసిస్ కెమెరాతో పాటు ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది.

నోకియా 6800

ప్రయోగాలు చేయడంలో నోకియాని మించిది లేదని చెప్పడానికి ఈఫోన్ బాగా సూట్ అవుతుంది.మాములుగా ఫోన్ లాగా కనిపించినా కాని కీస్ ఢిఫరెంట్ గా సెట్ చేశారు ఈ ఫోన్ లో

నోకియా 3250

మ్యూజిక్ లవర్స్ కోసం నోకియా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫోన్. కీ బోర్డ్ తో మీరు గేమ్ అడుకోవచ్చు కూడా. స్పిన్నింగ్ బటన్ తో మీరు మ్యూజిక్ ప్లేయర్ ని కంట్రోల్ చేయవచ్చు,

లేటెస్ట్ స్మార్ట్‌వాచీ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోకియా 7370

ఇది ఫస్ట్ వంపులు తిరిగిన ఫోన్. కర్వ్ డ్ , ఎడ్జెస్ చాలా ఢిఫరెంట్ గా ఉంటాయి. ఫ్యాషన్ డిజైన్ ఇష్టపడే వారి కోసం నోకియా ప్రత్యేకంగా 2005లో తీసుకొచ్చిన ఫోన్ ఇది.

నోకియా 7700

ఫస్ట్ మల్టీ మీడియా స్మార్ట్ ఫోన్. ఇది 2003లో అనౌన్స్ చేశారు. టచ్ స్క్రీన్ తో పాటు కెమెరా, బ్లూటూత్,ఎప్ఎమ్ రేడియో వెబ్ బ్రౌజర్ ఆప్సన్స్ ఉన్నాయి.

నోకియా 7710

2004లో రిలీజ్ అయింది. ఫస్ట్ టచ్ స్క్రీన్ ఫోన్ కూడా ఇదే.190 గ్రాముల బరువుండే ఈఫోన్ అప్పట్లోనే 500 డాలర్లకు అమ్ముడయింది.
షూట్ వీడియో, ఎంపీ 3 ప్లేయర్ , వెబ్ బ్రౌజర్ ప్రత్యేకతలు.

నోకియా ఎన్ గేజ్

2003లో లాంచ్ అయిన ఫోన్ ప్రత్యేకంచి గేమ్ అభిమానుల కోసమే రిలీజ్ చేశారు.

నోకియా 5510

ఈ ఫోన్ లో మొత్తం 145 కీస్ ఉంటాయి. దీని ధరదాదాపు 200 డాలర్లు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Weird Nokia phones you'll wish you owned Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot