2 లక్షల ఫ్రీడం 251 ఫోన్లు, వస్తున్నాయా..?

Written By:

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ దూసుకొచ్చిన రింగింగ్ బెల్స్ కంపెనీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచదేశాలకు సైతం దిమ్మతిరిగేలా చేసిన రింగింగ్ బెల్స్ మేక్ ఇన్ ఇండియా ఫోన్ అంటూ ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. ఈ కంపెనీపై కొత్త న్యూస్ బయటకొస్తోంది.

ఫోటోల ద్వారా కొత్త వైరస్,ఓపెన్ చేస్తే ఇక అంతే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పలు వివాదాల్లో

రూ. 251కే ఫోనంటూ జనాలను నమ్మించిన రింగింగ్ బెల్స్ సంస్థ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది. ఆ వివాదాలు అలా ఉండగానే ముందుగా ప్రకటించిన సమయానికి 2 లక్షల ఫోన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపింది.

కేవలం 5 వేలు

అన్నట్టుగానే జూలైలో ఫోన్లు పంపిణీ చేసింది. అయితే రెండు లక్షలు కాదు .. కేవలం 5 వేలు. త్వరలో మరో 65 వేల ఫోన్లు క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) ద్వారా డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్

అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా డెలివరీ చేయలేదు. దీంతో రింగింగ్ బెల్స్ తీరు 2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్'గా మిగిలిపోయింది.

ట్రై చేసి చూద్దాం

ఫ్రీడం ఫోన్లను బుక్ చేసిన వారు కూడా అంత సీరియస్గా తీసుకోలేదని, 'ట్రై చేసి చూద్దాం' అన్నట్టుగానే ఫోన్లను బుక్ చేశారని, సంస్థపై నమ్మకం లేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

దాదాపు ఏడుకోట్లమంది

ఫిబ్రవరిలో కంపెనీ చేసిన ప్రకటనకు దాదాపు ఏడుకోట్లమంది ఈ ఫోన్ కోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. కాని వారు ఇంతవరకు వాటిని సాధించలేదు. 

కంపెనీ ప్రతినిధులు

అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ ఫ్రీడం ఫోన్లు అదృశ్యమయ్యాయన్న విషయం నిజం కాదని, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు.

మోహిత్ గోయల్ ఓ ఇంటర్వ్యూలో

 గతంలో రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభుత్వం కనుక రూ. 50 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తే దేశంలో 75 కోట్ల మందిని ప్రీడం 251 ఫోన్ల ద్వారా డిజిటల్ ఇండియాలో భాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఫ్రీడం 251 ఫోన్ తెర వెనక్కి

దీన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పాటు ఈ ఫోన్ ప్రకటనపై అనేక అనుమానాలు రావడంతో ఫ్రీడం 251 ఫోన్ తెర వెనక్కి వెళ్లిపోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Where has Ringing Bells’ Freedom 251 smartphone disappeared? read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting