ఫోటోల ద్వారా కొత్త వైరస్,ఓపెన్ చేస్తే ఇక అంతే !

Written By:

ఇప్పటిదాకా ఏవైనా ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే కంప్యూటర్లలోకి వైరస్ వచ్చేది. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం ఫోటోల ద్వారానే వైరస్ కంప్యూటర్లలోకి జొరబడుతోంది. కొత్తగా కనుగొన్న ఈ వైరస్ కు కంప్యూటర్ నిపుణులు ఇమేజ్ గేట్ అని నామకరణం చేశారు. ఇది కేవలం ఫోటోలు ద్వారానే వస్తుందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.

రెండుగా చీలిపోతున్న శాంసంగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తగా వస్తున్న ఈ ఫోటోలు

మాములుగా ఫోటోలు jpeg, pngలో ఉంటాయి. అయితే కొత్తగా వస్తున్న ఈ ఫోటోలు ఆ ఫార్మెట్లో కాకుండా వేరే ఫార్మెట్లో వస్తున్నాయి. ఈ ఫోటో పెట్టడానికి సోషల్ మీడియాలో ఉన్న ప్రధానలోపాలను వారు ఆధారంచేసుకుంటారని నిపుణులు తెలుపుతున్నారు.

ఫోటో బాగుందని డౌన్ లోడ్ చేస్తే

ఈ ఫోటోలు ప్రధానంగా సోషల్ మీడియాలో ఉన్న ఫోటోల మాదిరిగానే ఉంటాయి. అయితే మనం ఫోటో బాగుందని డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు. సిస్టంలోకి కాని మొబైల్స్ లోకి కాని వైరస్ వెంటనే వచ్చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హ్యాకర్లు అడిగిన సొమ్మును చెల్లిస్తే

అది సిస్టం లోకి కానీ మొబైల్స్ లోకి రాగానే అవి వారి ఆధీనంలోకి వెళుతాయి. హ్యాకర్లు అడిగిన సొమ్మును చెల్లిస్తే కానీ పూర్వస్థితికి రాని పరిస్థితి నెలకొంటుంది. దీన్ని నిపుణులు ర్యాన్ సమ్ వేర్ గా కూడా చెబుతున్నారు.

సోషల్ మీడియాలు వాడే వారు

కాబట్టి సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఫేస్ బుక్ అలాగే లింక్ డన్, అలాగే ఇతర సోషల్ మీడియాలు వాడే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఫోటో ఎక్స్‌టెన్సన్ తేడాగా వుంటే డౌన్లోడ్ చేయవద్దు. ఉదాహరణకు (ఎస్.వి.జి, జె.ఎస్., హెచ్.టి.ఎ.) లాంటివి.

ఆ ఫోటోలు కనిపిస్తే

ఇప్పటికే ఈ ఫోటోలను గూగుల్ క్రోమ్ స్టోర్ నుండి తొలగించారు. ఫేస్ బుక్ కూడా ఇదే పనిలో నిమగ్నమైవుంది. మీకు ఆ ఫోటోలు కనిపిస్తే వెంటనే మెనూలోకి వెళ్లి టూల్స్, ఎక్స్‌టెన్సన్ నుంచి తొలగించాలి. దీంతో పాటు ఇతరులు పంపే జెపెగ్ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే డౌన్లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
ImageGate: Ransomware Spreading Via JPG Files on Social Networks read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot