లీ అంటే ఇండియాలో ఎందుకు అంత క్రేజ్..

Written By:

వచ్చి రావడంతోనే మార్కెట్లో సంచలనాలు నమోదు చేసిన ఫోన్ ఏదైనా ఉందంటే అదీ లీ కంపెనీ ఫోన్ మాత్రమే. ఇండియాలో ఓ రేంజ్ లో ఈ ఫోన్లు అమ్మకాలు జరిగాయి. చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ కంపెనీ లీ అతి తక్కువ ధరకే అధ్భుతమైన ఫీచర్లతో మొబైల్ ని అందిస్తున్నామని ప్రకటించడంతో లీ ఫోన్లు ఇండియాలో ఓ ప్రభంజనాన్నే సృష్టించాయి. అత్యంత తక్కువ ధరతో మరిన్ని ఇంటర్నెట్ ఫీచర్లతో లీ నుంచి వచ్చిన అన్ని ఫోన్లు చూపరుల మతిని పోగొట్టాయి. లీ నుంచి వచ్చిన లీ1ఎస్, లీ మాక్స్ ప్రో అలాగే రానున్న లీ 2 ఈ ఫోన్లు పాపులర్ ఎందుకు అయ్యాయో 10 కారణాలు మీ ముందుంచుతున్నాం వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : లీ 1ఎస్.. నెంబర్ వన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వర్కింగ్ ఫ్రొపెషనల్స్ కోసం

1

వర్కింగ్ ఫ్రొపెషనల్స్ స్మార్ట్ గా ఉండే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారు ఈ లీ స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా ఇష్టపడతారు కూడా. ఇతర ఫోన్లతో పోలిస్తే ఈ పోన్ ధర తక్కువగా ఉండటం అంతే కాకుండా అత్యాధునిక ఫీచర్లు ఉండటం కూడా వారికి బాగా కలిసివచ్చింది.

బ్యాటరీ లైఫ్

2

ఈ ఫోన్ బ్యాటరీలైప్ కూడా ఎక్కువ మన్నిక కావడంతో అందరూ దీని వైపే దృష్టి పెట్టారు. ఈ ఫోన్ లో యాప్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు షట్ డౌన్ చేసే ఆప్షన్ ఉండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది. క్విక్ ఛార్జింగ్ కూడా దీనికి తోడయింది. 

బ్రైట్ నెస్

3

ఫోన్ బ్రైట్ నెస్ కూడా ఇతర ఫోన్ల కన్నా ధీటుగా వస్తుండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది.హైఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఆఫర్ చేసే బీజిల్ లెస్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్ వంటి క్లాసికల్ ఫీచర్లను లీ 1ఎస్ ఫోన్‌లో మీరు చూడొచ్చు. పూర్తి మెటల్ బాడీతో వచ్చే ఫోన్ లు ఎంత వేగంగా హీట్ అవుతాయో అంతే వేగంగా కూల్ అవుతాయి. అదే విధంగా సిగ్నల్ రిసీవింగ్ కూడా వేగంగా ఉంటుంది.

మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌

4

ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లు

5

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

ఆటోమేటిక్ సిస్టిం

6

మీరు అత్యవసర మైన మీటింగ్ లో ఉన్నప్పుడు పోన్ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ తో మీరు ఆటోమేటిగ్గా మేసెజ్ లను అలాగే కాల్స్ ను డిస్ కనెక్ట్ చేయవచ్చు.

పిన్ టాప్

7

ఈ ఫోన్ లో కొత్తగా పిన్ టాప్ బటన్ చేర్చారు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నపుడు మీకు ఎటువంటి స్పామ్ మెయిల్స్ రాకుండా ఈ బటన్ ద్వారా అడ్డుకోవచ్చు.

స్టూడెంట్స్ , ట్రావెల్లర్స్ కోసం

8

స్టూడెంట్స్ కు ఈ ఫోన్ తో చాలానే ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. అలాగే నాలెడ్జికి సంబంధించిన అంశాలు ఈ ఫోన్ ద్వారా వారు పొందవచ్చు. సెల్పీలు ఇష్టపడేవారు ఈ ఫోన్ తో ట్రావెలింగ్ సమయంలో దర్జాగా ఫోటోలు దిగవచ్చు. పెద్ద డిస్ ప్లే తో ఆకట్టుకునే విధంగా మీ ఫోటోలను చూపెడుతుంది.

లీకో గురించి

9

ఇది 2004 నవంబర్ లో లీకో కంపెనీని స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం చైనాలోని బీజింగ్ నగరంలో ఉంది. స్మార్ట్ పోన్లనే కాకుండా ఇంటర్నెట్ టీవీ, వీడియో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ,స్మార్ట్ డివైసెస్, మొదలుగు ఉత్పత్తులను కూడా అందిస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

12

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Why Le Superphones have disrupted the purchasing pattern of Indian consumers
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting