మార్కెట్లోకి వికెడ్‌లీక్ సెన్సేషన్, గెలాక్సీ ఎస్3కి పోటి..?

Posted By: Prashanth

మార్కెట్లోకి వికెడ్‌లీక్ సెన్సేషన్, గెలాక్సీ ఎస్3కి పోటి..?

 

ముంబయ్ ఆధారిత టెక్ సంస్థ వికెడ్‌లీక్ తన వామ్మీ సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైన్‌ప్‌ను మరింత పటిష్టం చేస్తూ ‘వామ్మీ సెన్సేషన్’(Wammy Sensation) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్ ధర రూ.16,000. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3కి పోటిగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. స్పెసిఫికేషన్‌లు.........

బరువు ఇంకా చుట్టుకొలత: చుట్టుకొలత 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు,

డిస్‌ప్లే: 4.7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం),

కెమెరా: 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్, ఇన్-బుల్ట్ జీపీఎస్, 3జీ కనెక్టువిటీ,

బ్యాటరీ: 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 4 గంటలు, స్టాండ్‌బై 200 గంటలు),

అదనపు ఫీచర్లు: 3డి మ్యూజిక్, ఆడ్వాన్సుడ్ అప్లికేషన్ కిల్లర్, ఆల్డికో ఈ-బుక్, ఈబడ్డీ మెసెంజర్, ఫేస్‌బుక్, రోబో డిఫెన్స్, జీటాక్, థింక్‌ఫ్రీ మొబైల్, ట్విట్టర్.

ధర ఇతర వివరాలు: ధర రూ.16,000, ప్రీబుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి షిప్పింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రీఆర్డర్‌కు సంబంధించి మరింత సమాచారం కోసం www.wickedleak.orgలోకి లాగిన్ కావచ్చు. లింక అడ్రస్: http://www.wickedleak.org/

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌ 4.1జెల్లీబీన్ , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. ధరలు: 16జీబి వేరియంట్ - రూ.34,900, 32జీబి వేరియంట్ - రూ. 41,300.

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై ధరల తగ్గింపు (టాప్-5)!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot