ఈ ఫోన్ ధరెంతో తెలిస్తే గుండె ఆగిపోద్ది..

Written By:

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్ రిలీజయింది. లగ్జరీ ఫోన్ మేకర్ Vertu ఈ ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసింది. పాము ఆకారంలో ఉండే ఈ ఫోన్ విలువ దాదాపు రూ. 2.3 కోట్లు ఉంటుంది. 439 కెంపులతో చుట్టూ పాము డిజైన్ వచ్చేలా ఈ ఫోన్ ను రూపొందించారు. ఇక పాము కళ్లను ఎమరాల్డ్స్ తో పొదిగారు. ఫోన్ హైలెట్స్ ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

రూ. 400 కోట్ల నష్టం, జియోకి మండింది !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

288 భాగాలతో

288 భాగాలతో రూపొందిన ఈ ఫోన్‌ యూకేలో తయారు చేశారు. కేవలం ఎనిమిది యూనిట్ల ఫోన్‌ను మాత్రమే తయారుచేశారు.

జేడీ.కామ్‌లో

ఈ ఫోన్‌ కొనాలని ఆసక్తి కలిగిన వాళ్లు చైనీస్‌ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ జేడీ.కామ్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

ప్రీ-బుకింగ్‌

145 డాలర్లు అదనంగా చెల్లించి ప్రీ-బుకింగ్‌ కూడా చేసుకోవచ్చు.

బుక్ చేసుకున్న వెంటనే

ఇక ఈ ఫోన్‌లో మిగతా స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు మామూలుగానే ఉన్నాయి. అయితే కష్టమర్లు బుక్ చేసుకున్న వెంటనే ఈ ఫోన్ ను వారికి హెలికాప్టర్ ద్వారా అందజేస్తారు.

2 జీబీ ర్యామ్‌

రెండు అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్‌, 16జీబీ ఇంటర్నల్‌ మెమరీ, ఐదున్నర గంటలసేపు ఫోన్‌ చేసి మాట్లాడుకోగల బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
World’s most expensive feature phone Vertu Signature Cobra launched at Rs 2.3 crore read more at Gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting