రూ. 400 కోట్ల నష్టం, జియోకి మండింది !

Written By:

జియోకి మండింది. ప్రత్యర్థి కంపెనీలపై విరుచుకుపడింది. టెలికం దిగ్గజాలపై మరోసారి ఎదురుదాడికి దిగింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాలపై తీవ్ర ఆరోపణలతో డిపార్టమెంట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ గడప తొక్కింది. వీటి కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని ఆరోపిస్తూ డాట్‌కు ఫిర్యాదు చేసింది. ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌, ఐడియా మార్చిలో అవసరమైన లైసెన్స్ ఫీజును జమ చేయలేదంటూ జియో టెలికాం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.

8 నిమిషాల్లో 2 లక్షల యాభై వేల ఫోన్ల అమ్మకాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రభుత్వానికి రూ .400 కోట్ల నష్టం

గత త్రైమాసికంలో ముందస్తు లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లింపు కారణంగా ప్రభుత్వానికి రూ .400 కోట్ల నష్టం వచ్చిందని, దీనిపై డాట్‌ సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా జియో కోరింది.

లైసెన్స్ రద్దు చేయాలని

లైసెన్సులను ఏకపక్షంగా నిర్ణయించడం, తక్కువ లైసెన్స్ ఫీజులను అనుమతించడం లాంటి చర్యలు నిబంధనల ఉల్లంఘనగా ఉందని తన లేఖలో పేర్కొంది. వీరి లైసెన్స్ రద్దు చేయాలని కోరింది. ఆర్థిక జరిమానాగా రూ.50 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్‌ చేస్తోంది.

లైసెన్స్‌ ఫీజు చెల్లించడంలో

లైసెన్స్‌ ఫీజు చెల్లించడంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ లైసెన్సు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించాయంటూ ముకేష్ అంబానీ నేతృత‍్వంలోని జియో పిటిషన్‌ దాఖలు చేసింది.

2016-17 నాటికి

2016-17 నాటికి అంచనా వేసిన స్థూల రాబడి ఆధారంగా చెల్లించిన ఫీజు, లైసెన్స్ నిబంధనలకు చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు కంటే తక్కువగా ఉందని పేర్కొంది

ఫిర్యాదు ప్రకారం

ఫిర్యాదు ప్రకారం, ఎయిర్టెల్ జనవరి-మార్చి 2017 నాటికి రూ. 950 కోట్ల లైసెన్స్ ఫీజుగా చెల్లించింది. అక్టోబర్-డిసెంబరు 2017 వరకు ఎయిర్టెల్ చెల్లించిన 1,099.5 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే ఇది రూ. 150 కోట్ల తక్కువ.

వోడాఫోన్

అదేవిధంగా, వోడాఫోన్ రూ. 550 కోట్లు చెల్లించింది, ఇది మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ. 746.8 కోట్ల లైసెన్స్ ఫీజుతో పోలిస్తే రూ. 200 కోట్లు తక్కువ . అలాగే మూడవ త్రైమాసికంలో చెల్లించిన రూ.609 కోట్లతో పోలిస్తే ఐడియాఈ క్వార్టర్‌లో రూ.60కోట్లు తక్కువ చెల్లించింది.

ఆదాయాల ఆధారంగా

కాగా నిబంధనల ప్రకారం, టెలికం ఆపరేటర్ ఆశించిన ఆదాయాల ఆధారంగా జనవరి-మార్చి కాలానికి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కానీ అదే ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో చెల్లించిన రుసుము కన్నా తక్కువగా ఉండకూడదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel, Voda, Idea caused Rs 400-cr loss to govt, says Reliance Jio read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot