50MP + 50MP + 50MP కెమెరాలు, 90W ఛార్జింగ్ సపోర్టుతో షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ విడుదల.. పూర్తి వివరాలు..!
షియోమీ 15 సిరీస్ తాజాగా భారత్ మార్కెట్ లో (Xiaomi 15 Smartphone Launched in india) లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సిరీస్ చైనాలో లాంచ్ అయింది. షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. కర్వడ్ ఎడ్జ్‌లతో ఆకట్టుకుంటుంది. Leica భాగస్వామ్యంతో నాణ్యమైన కెమెరాలను అమర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది.
షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్ 6.36 అంగుళాల ఫుల్ HD+ (1200*2670 పిక్సల్స్) LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 3200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 Elite SoC చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ హ్యాండ్‌సెట్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. ఈ షియోమీ స్మార్ట్‌ఫోన్ 90W వైర్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5240mAh బ్యాటరీని కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు Leica భాగస్వామ్యంతో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు OIS, 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G. 4G LTE, బ్లూటూత్, వైఫై 7, GPS, NFC, USB-C 3.2 ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999 గా ఉంది. మార్చి 19 నుంచి ఫోన్ ముందస్తు బుకింగ్స్ (Pre Order) చేసేందుకు అవకాశం ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో రూ.5000 తగ్గింపు ధరను పొందవచ్చు. రూ.5999 విలువైన షియోమీ కేర్ ప్లాన్‌ను ఉచితంగా పొందవచ్చు.
ఇవాళ కొంత మందికి ఎర్లీ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. షియోమీ 15 స్మార్ట్‌ఫోన్ షియోమీ ఇండియా ఇ-స్టోర్, అమెజాన్ మరియు ఇతర ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది. ఈ హ్యాండ్‌సెట్ వైట్, బ్లాక్, గ్రీన్ వంటి మూడు రంగుల్లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








