Home
Mobile

200MP కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్‌, 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లేతో 5G ఫోన్ విడుదల..!

Xiaomi 17 Ultra Smartphone : భారత్‌ మార్కెట్‌లో షియోమీ 17 సిరీస్‌లో భాగంగా షియోమీ 17 తోపాటు 17 అల్ట్రా మోడల్స్‌ లాంచ్‌ అయ్యాయి. షియోమీ ప్యాడ్‌ 8 కూడా ఇటీవలే విడుదల అయింది. అయితే షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 చిప్, 200MP కెమెరాను కలిగి ఉంది. రూ.19999 విలువైన షియోమీ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీ కిట్‌ ప్రో ను ఉచితంగా పొందవచ్చు.

షియోమీ 17 అల్ట్రా పూర్తి వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 6.9 అంగుళాల HyperRGB OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. షియోమీ షీల్డ్‌ గ్లాస్‌ 3.0 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Xiaomi 17 Ultra launch news in telugu

ఈ ఫోన్ డాల్బీ విజన్‌, HDR+ కంటెంట్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. వెట్‌ టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడిచేతులతోనూ ఆపరేట్‌ చేసుకోవచ్చు. TUV Rheinland ఫ్లిక్కర్‌ ఫ్రీ, సర్కాడియన్‌ ఫ్రెండ్లీ, Low బ్లూ లైట్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది.

పవర్‌ఫుల్‌ చిప్‌సెట్‌ :
ఈ అల్ట్రా వేరియంట్‌ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB LPDDR5x ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 పైన పనిచేస్తుంది. Adreno GPU, క్వాల్‌కాం AI ఇంజిన్‌ను కలిగి ఉంది.

Xiaomi 17 Ultra launch news in telugu

200MP కెమెరా :
ఈ ఫోన్‌ Leica భాగస్వామ్యంతో కెమెరాలను కలిగి ఉంది. వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలున్నాయి. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్ (OIS) తో 50MP 1-inch లైట్ ఫ్యూజన్ 1050L సెన్సర్‌ ఉంది. 120x డిజిటల్‌ జూమ్, OIS తో 200MP టెలిఫోటో లెన్స్‌ ఉంది.

50MP సెల్ఫీ కెమెరా :
వీటితోపాటు 115 డిగ్రీల ఫీల్డ్‌ ఆఫ్‌ వ్యూతో 50MP అల్ట్రావైడ్ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు 30fps తో 8K వీడియో రికార్డింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W వైర్‌, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది.

Xiaomi 17 Ultra launch news in telugu

భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, AI ఫేస్‌ లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్‌ 6, GPS, NFC, NavlC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ఇ-కంపాస్‌, గైరోస్కోప్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్‌ సెన్సర్‌, IR బ్లాస్టర్‌ ఉన్నాయి. IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

షియోమీ 17 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ :
ఈ ఫోన్‌ 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,39,999 గా ఉంది. ఈ ఫోన్ ఎర్లీ బడ్డ్‌ సేల్‌ మార్చి 13 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. SBI క్రెడిట్‌ కార్డులపై రూ.10,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.19,999 విలువైన షియోమీ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రఫీ కిట్‌ ప్రో ను ఉచితంగా అందిస్తామని తెలిపింది.

అయితే మార్చి 18 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. షియోమీ ఇండియా వెబ్‌సైట్‌, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ అల్ట్రా మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ వైట్‌, బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi 17 Ultra with 200MP Telephoto camera, snapdragon 8 gen 5 Chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X