Home
Mobile

67W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ, 50MP లైకా కెమెరా.. షియోమీ సీవీ 5 ప్రో త్వరలో.. అదిరిపోయే ఫీచర్లు లీక్!

Xiaomi Civi 5 Pro features : షియోమీ నుంచి త్వరలో సీవీ 5 ప్రో ( Xiaomi Civi 5 Pro ) అనే కొత్త ఫోన్ రాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్లు ఇప్పుడే లీక్ అయ్యాయి. షియోమీ ఇంకా అధికారికంగా విడుదల తేదీ చెప్పకపోయినా, చైనా 3C సర్టిఫికేషన్ డేటాబేస్‌లో ఈ ఫోన్ కనిపించింది. దీని మోడల్ నంబర్ 25067PYE3C అని తెలిసింది.

ఈ లిస్టింగ్ ద్వారా ఫోన్‌ లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని ఖాయమైంది. అయితే, ఈ సర్టిఫికేషన్‌లో ఇతర వివరాలు (స్పెసిఫికేషన్లు) ఏవీ బయటకు రాలేదు. టెక్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం దీని ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం. ఇవి కేవలం అంచనా వేసిన ఫీచర్లు మాత్రమే. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Xiaomi Civi 5 Pro

* ఫీచర్లు
ప్రముఖ లీక్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 (Snapdragon 8s Gen 4) ప్రాసెసర్ ఉండవచ్చు. త్వరలో రాబోయే ఈ క్వాల్‌కామ్ చిప్‌సెట్‌ లో ఒకే కార్టెక్స్-X4 ప్రైమ్ కోర్, అడ్రినో 825 (Adreno 825) GPU ఉండే అవకాశం ఉంది.

ఇంకా, ఈ ఫోన్ కేవలం 7mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుందని, భారీ 6000mAh బ్యాటరీతో వస్తుందని అంటున్నారు. సీవీ 4 ప్రోలోని 4700mAh బ్యాటరీతో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్. బ్యాటరీ సామర్థ్యం పెరిగితే చాలామంది దీన్ని కొనుగోలు చేయడానికి కచ్చితంగా మొగ్గు చూపిస్తారు.

* డిస్‌ప్లే, కెమెరా అప్‌గ్రేడ్స్ అదుర్స్
షియోమీ సీవీ 5 ప్రో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో, అదీ 1.5K రిజల్యూషన్‌తో వస్తుందని అంచనా. ఈ స్క్రీన్ చూసేవారికి ఒక ప్రీమియం అనుభూతిని అందిస్తుందట. కెమెరా విషయానికొస్తే, షియోమీ ఈసారి లైకా (Leica) ట్యూన్ చేసిన సెన్సార్లను వాడవచ్చు. ముఖ్యంగా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండొచ్చని టాక్.

* ఎప్పుడు లాంచ్ అవుతుంది?
షియోమీ ఇంకా అధికారికంగా లాంచ్ తేదీని ప్రకటించకపోయినా, వచ్చే ఏడాది (2025) ఏప్రిల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌ను విడుదల చేసిన తర్వాత ఈ ఫోన్ మార్కెట్లోకి రావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది మార్చిలో సీవీ 4 ప్రో లాంచ్ అయింది.

దాని తర్వాతి మోడల్ కోసం టెక్ ప్రియులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షియోమీ సీవీ 5 ప్రో కేవలం చైనా మార్కెట్‌కే పరిమితం కాకపోవచ్చు. దీన్ని గ్లోబల్ మార్కెట్లలో వేరే పేరుతో, బహుశా షియోమీ 15 సివి (Xiaomi 15 Civi) గా లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. IMEI డేటాబేస్ ఈ విషయాన్ని బలపరుస్తోంది.

చైనా కోసం 25067PYE3C, ఇండియా కోసం 25067PYE3I అనే రెండు మోడల్ నంబర్లు కనిపించాయి. దీన్ని బట్టి, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఫోన్‌ను రీబ్రాండ్ చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Civi 5 Pro Leaks Snapdragon 8s Gen 4, 67W Charging, 6000mAh Battery and 50MP Camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X