తెలుగు సపోర్ట్‌తో ‘షియోమి ఎంఐ 4ఐ’

తమ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక ప్రకటనలతో ఊరిస్తూ వచ్చిన షియోమి ఎట్టకేలకు తన ‘ఎమ్ఐ 4ఐ' (Mi 4i) స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 2జీబి ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్‌ను గురువారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా షియోమి ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఫోన్ ఏప్రిల్ 30 నుంచి ఈ-కామర్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుంది. ఎమ్ఐ 4ఐ ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండో ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఓపెన్ అవుతుంది.

షియోమి ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
సన్‌లైట్ డిస్‌ప్లే ఫీచర్‌తో కూడిన 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), ఆండ్రాయిడ్ 50 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఇంకా చదవండి: క్వాడ్ హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌లు


Click it and Unblock the Notifications