ఓపెన్ సేల్ పై ‘షియోమీ ఎంఐ 4ఐ’
షియోమీ కంపెనీ ఇటీవల విడుదల చేసిన ‘ఎంఐ 4ఐ' స్మార్ట్‌ఫోన్‌ను ఓపెన్ సేల్ పై ఫ్లిప్‌కార్ట్ విక్రయించనుంది. ఏ విధమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవసరం లేకుండా షియోమీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లను మే 25, మే 26 (వచ్చే సోమ, మంగళ తేదీల్లో బుక్ చేసుకోవచ్చు.

(చదవండి: ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000 ప్లస్)
షియోమీ ఎంఐ 4ఐ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 1920×1080పిక్సల్స్, 441 పీపీఐ), 1.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టాకోర్ (1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ + 1.7గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్) 64 బిట్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు సీఎమ్ఓఎస్ సెన్సార్, ఎఫ్/2.0 అపెర్చర్), డ్యుయల్ టోన్ ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (ప్రత్యేకతలు ఎఫ్/1.8 అపెర్చర్, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్).

(చదవండి: బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు)
ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ ఆపరేటింగ్ సిస్టం, ఎమ్ఐయూఐ 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో. తెలుగు సహా 6 ప్రాంతీయ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 3జీ, డ్యుయల్ సిమ్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 4.1, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఫోన్‌లో పొందుపరిచారు. 3,120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లాక్, వైట్, ఆరెంజ్, లైట్ బ్లూ, పింక్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








