ఓపెన్ సేల్ పై లెనోవో ఏ6000 ప్లస్
ఫ్లాష్‌సేల్ రూపంలో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న లెనోవో ఏ6000 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను మే 25, మే 26 తేదీలో ఓపెన్ సేల్ పై విక్రయించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
(మనం తీస్తే సెల్ఫీ.. ఏనుగు తీస్తే ‘ఎల్ఫీ')

ఆన్‌లైన్ మార్కెట్లో విడుదలైన నాటి నుంచి లెనోవో ఏ6000 ప్లస్‌ను ఓపెన్ సేల్ పై విక్రయించటం ఇదే మొదటి సారి. లెనోవో ఏ6000 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా విడుదలైన లెనోవో ఏ6000 ప్లస్ శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. వాటిని పరిశీలించినట్లయతే..
(యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్)

2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్ (64 బిట్), 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.


Click it and Unblock the Notifications








