షియోమి నుంచి ప్రపంచంలోనే అత్యంత పవర్‌పుల్ ఫోన్లు

Written By:

అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న షియోమి ఫోన్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. బీజింగ్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో షియోమి వీటిని లాంచ్ చేసింది. Xiaomi Mi 5s, Mi 5s Plus పేర్లతో వచ్చిన ఈ ఫోన్లనుప్రపంచంలోనే అత్యంత పవర్ పుల్ ఫోన్లుగా కంపెనీ అభివర్ణించింది. బెంచ్ మార్క్ లో షియోమి Mi 5s అగ్రస్థానాన్నికైవసం చేసుకున్న విషయం తెలిసిందే. షియోమి నుంచి వచ్చిన ఈ ఫోన్ల స్పెషిఫికేషన్స్ ధరలపై ఓ స్మార్ట్ లుక్కుద్దాం.

దిగ్గజాలే ఖంగుతిన్న వేళ : ఆండ్రాయిడ్ ఫోన్లలోనే టాప్ Xiaomi Mi 5s..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3GB RAM/ 64GB storage

Qualcomm's Snapdragon 821 SoCతో వచ్చిన ఈ పోన్లను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోన్లుగా కంపెనీ అభివర్ణించింది. Xiaomi Mi 5s 3GB RAM/ 64GB storage ఫోన్ ధరను కంపెనీ CNY 1,999 అంటే ఇండియా కరెన్సీలో రూ.20,00గా నిర్ణయించింది.

4GB RAM/ 128GB storage

4GB RAM/ 128GB storage ఫోన్ ధరను CNY 2,299 అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 22,900గా నిర్ణయించింది.

Xiaomi Mi 5s Plus 4GB RAM/ 64GB

Xiaomi Mi 5s Plus 4GB RAM/ 64GB ఫోన్ ధరను CNY 2,299 ఇండియన్ కరెన్సీలో రూ. 22,900గా నిర్ణయించింది. అదే 6GB RAM/ 128GB storage ఫోన్ ధరను CNY 2,599 ఇండియన్ కరెన్సీలో రూ. 26,000గా నిర్ణయించింది.

నాలుగు రకాల వేరియంట్లలో

రెండు డివైస్‌లు నాలుగు రకాల వేరియంట్లలో లభ్యమవుతున్నాయి. Gold, Rose Gold, Silver, and White రంగుల్లో లభ్యమవుతున్నాయి. కంపెనీ ఈ ఫోన్లను JD.com and Mi.comలో ఫ్లాష్ సేల్ కింద విక్రయించనుంది.

డిస్ ప్లే

ఫీచర్ల విషయానికొస్తే..Xiaomi Mi 5s 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 650 నిట్స్ బ్రైట్‌నెస్‌‌తో పాటు 1920×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. 3డీ టచ్ సపోర్ట్ ను కలిగి ఉంది. అదిరిపోయో బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ వచ్చింది. 16 ultra-bright LED lightsతో ఈ ఫోన్ డిస్ ప్లే కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. షియోమి Mi 5s Plus కూడా అదే బ్రైట్ నెస్ తో 5.7 ఇంచ్ డిస్ ప్లేతో వచ్చింది.

కెమెరా

షియోమి Mi 5s Plus రెండు కెమెరాలతో వచ్చింది. 13 మెగా ఫిక్సల్ సెన్సార్ తో ఫోటోలు తీయవచ్చు.ఒక కెమెరా రంగుల్లో మరొక కెమెరా బ్లాక్ అండ్ వైట్ లో ఫోటోలు తీసుకునేలా రూపొందించారు. Xiaomi Mi 5s లో అయితే ఒకటే 12 మెగా ఫిక్సల్ రేర్ కెమెరాను పొందుపరిచారు. రెండు ఫోన్లు PDAF autofocusతో పనిచేస్తాయి.

సెల్ఫీ

రెండు డివైస్ లకు 4 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరాలను పొందుపరిచారు. ఇందులో క్లాక్ స్పీడ్ ప్రాసెసర్ ని పొందుపరిచారు. అంతే కాకుండా 2 మైక్రాన్ పిక్సల్ f/2.0 apertureతో ఫోటోలు షూట్ చేయవచ్చు.

ప్రాసెసర్

Xiaomi Mi 5s 2.15GHz Snapdragon 821 SoC ప్రాసెసర్ తో వస్తే, Mi 5s Plus 2.35GHz Snapdragon 821 SoC తో వస్తోంది.హోమ్ బటన్ కి అల్ట్రా సోనిక్ పింగర్ ప్రింట్ సెన్సార్ ని పొందుపరిచారు. కింద గ్లాస్ ని వేయడం వల్ల సెన్సార్ ఎటువంటి డ్యామేజికి గురికాదని కంపెనీ చెబుతోంది.

కనెక్టివిటి

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్ అదనపు ఫీచర్లు. రెండుఫోన్లు 4జీ కనెక్టివిటీతో పనిచేస్తాయి. Xiaomi Mi 5s 3200mAh బ్యాటరీతో రాగా Xiaomi Mi 5s ప్లస్ మాత్రం 3800mAh బ్యాటరీతో వచ్చింది. త్వరలో ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Xiaomi Mi 5s, Mi 5s Plus Launched: Price, Release Date, Specifications, and More Read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot