దిగ్గజాలే ఖంగుతిన్న వేళ : ఆండ్రాయిడ్ ఫోన్లలోనే టాప్ Xiaomi Mi 5s..

By Hazarath
|

దిగ్గజాలకు షియోమి దడ పుట్టిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన అన్ని స్మార్ట్‌ఫోన్లకు సవాల్ విసురుతూ షియోమి కొత్త ఫోన్ xiaomi mi 5s టాప్‌లోకి దూసుకెళ్లింది. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా... ఈ ఫోన్‌కు సంబంధించిన బెంచ్ మార్క్ స్కోరే దీన్ని టాప్‌లో నిలిపింది. రేపు విడుదల కానున్న ఈ ఫోన్ 1,64,119 బెంచ్ మార్క్ స్కోరుతో మిగతా ఫోన్లకు అందనంత దూరంలో నిలిచింది. ఫీచర్స్ ఏంటి..బెంచ్ మార్క్ అంటే ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

3డీ టచ్ ఫీచర్‌, 6 జిబి ర్యామ్‌తో షియోమి మి5ఎస్ !

స్మార్ట్‌ఫోన్ల‌లోని హార్డ్‌వేర్, వాటి కాన్ఫిగ‌రేష‌న్‌కు అనుగుణంగా

స్మార్ట్‌ఫోన్ల‌లోని హార్డ్‌వేర్, వాటి కాన్ఫిగ‌రేష‌న్‌కు అనుగుణంగా

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లోని హార్డ్‌వేర్, వాటి కాన్ఫిగ‌రేష‌న్‌కు అనుగుణంగా ఫోన్ల‌కు బెంచ్ మార్క్ స్కోర్ నిచ్చే అప్లికేష‌న్లు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి.

కొంత స్కోర్‌

కొంత స్కోర్‌

ఫోన్‌లోని ప్రాసెస‌ర్‌, ర్యామ్‌, గ్రాఫిక్స్‌, స్టోరేజ్ వంటి రీడింగ్స్‌ను తీసుకుని ఈ అప్లికేష‌న్లు కొంత స్కోర్‌ను ఇస్తాయి. అదే బెంచ్ మార్క్ స్కోర్‌.

ఎంత ఎక్కువ‌గా ఉంటే

ఎంత ఎక్కువ‌గా ఉంటే

ఈ స్కోర్ ఎంత ఎక్కువ‌గా ఉంటే ఆ ఫోన్ అంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంద‌ని అర్థం. ఎక్కువ స్కోర్ ఉన్న ఫోన్లు బాగా వేగంగా ప‌నిచేస్తాయ‌ని తెలుసుకోవాలి.

షియోమీ ఎంఐ 5ఎస్ బెంచ్ మార్క్ స్కోర్ 1,64,119

షియోమీ ఎంఐ 5ఎస్ బెంచ్ మార్క్ స్కోర్ 1,64,119

ఈ క్ర‌మంలో షియోమీ ఎంఐ 5ఎస్ సాధించిన బెంచ్ మార్క్ స్కోర్ 1,64,119 కాగా ,ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ల క‌న్నా ఇదే ఎక్కువ‌ని తెలిసింది. దీంతో మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనూ ఈ స్మార్ట్‌ఫోనే టాప్ స్థానంలో నిలిచింద‌ని ప‌లువురు టెక్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు

ఐఫోన్ 7 బెంచ్ మార్క్ స్కోర్

ఐఫోన్ 7 బెంచ్ మార్క్ స్కోర్

ఆపిల్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఐఫోన్ 7 బెంచ్ మార్క్ స్కోర్ 1,75,000 కాగా, ఈ ఫోన్‌లో యాపిల్ ఎ10 ఫ్యూష‌న్ చిప్, ప్రాసెస‌ర్‌ను ఉప‌యోగించారు. అందుకే అంత‌టి స్కోర్ వ‌చ్చింది. అనంత‌రం స్థానంలో షియోమీ ఎంఐ 5ఎస్ నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

ఈ ఫోన్ కోసం చాలా మంది

ఈ ఫోన్ కోసం చాలా మంది

ఇప్ప‌టికే ఈ ఫోన్ కోసం చాలా మంది ఆండ్రాయిడ్ మొబైల్ యూజ‌ర్లు వేచి చూస్తున్న నేప‌థ్యంలో రేపు ఆ ఫోన్ విడుద‌ల కానుంది. అనంత‌రం ఆ ఫోన్ గురించిన పూర్తి వివ‌రాలు, ధ‌ర తెలిసే అవ‌కాశం ఉంది.

వ‌న్ ప్ల‌స్ 3

వ‌న్ ప్ల‌స్ 3

కాగా బెంచ్ మార్క్ స్కోర్ల‌లో షియోమీ ఎంఐ 5ఎస్ త‌రువాతి స్థానాల్లో వ‌న్ ప్ల‌స్ 3 (1,42,927 స్కోర్‌), శాంసంగ్ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్ (1,31,479), ఎల్‌జీ జీ5 (1,31,423)లు నిలిచాయి.

5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

ఫీచర్ల విషయానికొస్తే.. 5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 650 నిట్స్ బ్రైట్‌నెస్‌‌తో పాటు 1920×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. 3డీ టచ్ సపోర్ట్ ను కలిగి ఉంది. (Image: Xiaomi Mi 5 ) 

ప్రాసెస‌ర్‌

ప్రాసెస‌ర్‌

క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 821 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్ (Image: Xiaomi Mi 5 )

ర్యామ్‌

ర్యామ్‌

4/6 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లతో ఈ ఫోన్ రానుంది. మైక్రో ఎస్ డీ ద్వారా విస్తరణ సామర్థ్యం కూడా ఉంది. (Image: Xiaomi Mi 5 )

కెమెరా

కెమెరా

కెమెరా కూడా అదిరే స్థాయిలో రానుందని తెలుస్తోంది. 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ , 4 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4కే వీడియో సపోర్టింగ్, డ్యూయల్ సిమ్‌తో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది.

అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌

అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌

అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయ‌ల్ బ్యాండ్‌ , బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి వంటి అదనపు ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. (Image: Xiaomi Mi 5 )

 బ్యాట‌రీ

బ్యాట‌రీ

3490 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0. అయితే ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రేపు లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశం ఉంది. (Image: Xiaomi Mi 5 )

 ఆ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది

ఆ ఫోన్ ధర రూ. 2 వేలు తగ్గింది

క్లిక్ చేయండి క్లిక్ చేయండి 

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Teases The High End Benchmark Scores Tipped For Mi 5S Ahead Of 27th September Launch Read more telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X