భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, ధరెంతో తెలుసా..?

Written By:

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన సరికొత్త ఫోన్ ఎంఐ మ్యాక్స్‌2ను జూన్ 1వ తేదీన రిలీజ్ చేయనుంది. భారీ డిస్‌ప్లేతో పాటు అతి పెద్ద బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. 4జిబి ర్యామ్ తో వినియోగదారులను అలరించనున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో కనువిందు చేయనుంది. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ల‌లో విడుద‌ల కానున్న ఈ ఫోన్ వ‌రుస‌గా రూ.15,949, రూ.18,770 ధ‌ర‌ల‌కు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

ఫోన్ అదిరింది, రూ. 4999కే 2జిబి ర్యామ్, 8ఎంపీ కెమెరా,5 ఎంపీ సెల్ఫీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్ ప్లే

డిస్ ప్లే విషయానికొస్తే 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో పాటు 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ మీద ఆపరేట్ అవుతుంది.

ర్యామ్

4 జీబీ ర్యామ్ తో వచ్చిన ఈ మొబైల్ 64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ తో వచ్చింది.

కెమెరా

12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ డ్యుయ‌ల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 5300 ఎంఏహెచ్ బ్యాట‌రీని పొందుపరిచారు. ఫాస్ట్ ఛార్జింగ్ క్విక్ చార్జ్ 3.0 దీని సొంతం.

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, ఆండ్రాయిడ్ 7.1 నూగట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ అదనపు ఫీచర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Max 2 With Massive 6.44-Inch Screen, Two-Day Battery Life Launched Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting