Home
Mobile

జియోపై తొడగొట్టిన షియోమి, అత్యంత తక్కువ ధరకే ఫీచర్ ఫోన్

దేశీయ ఫీచర్ ఫోన్ మార్కెట్లో అసలైన వార్ కి తెరలేవబోతోంది. చైనా మొబైల్ దిగ్గజం షియోమికి ఇండియా టెలికాం రారాజు రిలయన్స్ కి మధ్య ఫీచర్ ఫోన్ యుద్ధం మొదలయినట్లేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

By Hazarath Aiah

దేశీయ ఫీచర్ ఫోన్ మార్కెట్లో అసలైన వార్ కి తెరలేవబోతోంది. చైనా మొబైల్ దిగ్గజం షియోమికి ఇండియా టెలికాం రారాజు రిలయన్స్ కి మధ్య ఫీచర్ ఫోన్ యుద్ధం మొదలయినట్లేనని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా చైనా మొబైల్స్ తయారీదారు షియోమీ జియో 4జీ ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఓ నూతన 4జీ ఫీచర్ ఫోన్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. కిన్ ఏఐ ఫోన్ (Qin AI Phone) పేరిట ఈ 4జీ ఫీచర్ ఫోన్ విడుదలైంది. షియోమీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. అత్యంత తక్కువ ధరతో పాటు అదిరిపోయే ఫీచర్లను షియోమి కంపెనీ ఈ ఫోన్ లో పొందుపరిచింది.

కిన్ ఏఐ ఫోన్ ఫీచర్లు

కిన్ ఏఐ ఫోన్ ఫీచర్లు

2.8 ఇంచ్ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 512 ఎంబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, యూఎస్‌బీ టైప్ సి, 1480 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర

ధర

దీని ధరను చైనాలో 199 Yuanగా నిర్ణయించింది. అది ఇండియా కరెన్సీలో సుమారు రూ.1,990గా ఉంది. బ్లాక్, వైట్ కలర్ వేరియెంట్లలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి చైనాలోని వినియోగదారులకు లభ్యం కానుంది.

ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది..

ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది..

అయితే ఈ ఫోన్ ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇండియాలో హైఎండ్ మార్కెట్లో షియోమి శరవేగంగా పుంజుకుంటున్న నేపథ్యంలో ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్లో కూడా సత్తా చాటేందుకు ఈ ఫోన్ ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2.8 ఇంచ్ డిస్‌ప్లే

2.8 ఇంచ్ డిస్‌ప్లే

కిన్ ఏఐ ఫోన్‌లో 2.8 ఇంచ్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ ఆధారిత మొకొర్ 5 ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఏఐ వాయిస్ ఫీచర్స్

ఏఐ వాయిస్ ఫీచర్స్

ఇందులో ఏఐ వాయిస్ ఫీచర్స్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఈ ఫోన్ సహాయంతో 17 భాషల్లోకి పదాలను రియల్ టైం వాయిస్ ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

అలాగే ఈ ఫోన్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిన్న పిల్లలకు పాటలను చదివి వినిపిస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. 4జీ వీవోఎల్‌టీఈ స‌దుపాయాన్ని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

జియోఫోన్ ఫీచర్లు

జియోఫోన్ ఫీచర్లు

కాగా జియోఫోన్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి 

జియో ఫోన్ ఫీచర్లు
2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యా

జియోఫోన్ 2

జియోఫోన్ 2

జియోఫోన్ విజయవంతమైన నేపథ్యంలో ముఖేష్ అంబానీ జియోఫోన్ 2ని మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 

జియోఫోన్ 2 ఫీచర్లు
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, బ్లాక్‌బెర్రీ లాంటి క్వర్టీ కీప్యాడ్‌, కిఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరణ, 2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ, వాయిస్‌ ఓవర్‌ వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎం రేడియో, 2 మెగాపిక్సెల్‌ సెన్సార్‌, వీజీఏ సెన్సార్‌, డ్యూయల్‌ సిమ్‌ కార్డు సపోర్టు.

జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్ ఆ ఫోన్‌కి మాత్రమే!

జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్ ఆ ఫోన్‌కి మాత్రమే!

జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా

జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా

జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?

రూ. 501కే జియో ఫోన్

రూ. 501కే జియో ఫోన్

జియో విప్లవంలో కంటికి కనపడని రహస్యాలు

జియో విప్లవంలో కంటికి కనపడని రహస్యాలు

Best Mobiles in India

English summary
Xiaomi Qin AI is Android-powered, 4G VoLTE-enabled feature phone with real-time voice translation More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X