8 నిమిషాల్లో 2 లక్షల యాభై వేల ఫోన్ల అమ్మకాలు !

Written By:

షియోమి రెడ్‌మి 4 ఫస్ట్ సేల్ ఈ రోజుల మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ సేల్ లో రెడ్‌మి 4 దుమ్ము రేపింది. కేవలం 8నిమిషాల్లో 2,50,000 ఫోన్ల అమ్మకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. షియోమి చరిత్రలోనే ఇది ఓ రికార్డని కంపెనీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అయితే జనవరిలో జరిగిన సేల్ లో 10 నిమిషాల్లో 2లక్షల యాభై వేల ఫోన్లను అమ్మగా ఇప్పుడు ఆ మైలురాయిని కంపెనీ దాటింది. అంతలా దుమ్ము రేపడానికి అందులో ఏమున్నాయో ఓ సారి చూద్దాం.

సగానికి పైగా తగ్గనున్న ఫోన్ల ధరలు, కొంచెం ఆగితే చాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు రకాల వేరియంట్‌లలో...

మొదటి వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.6,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.8,999. మూడవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.10,999.

రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ.

రెడ్‌మి4 లాంచ్ డే ఆఫర్స్

లాంచ్ డే ఆఫర్స్ లో భాగంగా రెడ్మీ 4 కొనుగోలు పై ఎస్ బ్యాంక్ క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్ యూజర్లు రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. అంతేకాకుండా, రెడ్మీ 4 కొనుగోలు పై వొడాఫొన్ కస్టమర్‌లు 45జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది. ఈ డేటాను 5 నెలల పాటు వినియోగించుకవచ్చు. రూ.499 ఖరీదు చేసే రెడ్మీ4 ఒరిజినల్ ఎంఐ కేస్ రూ.349కే సొంతమవుతుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్

రెడ్‌మి 4 ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ప్లస్ పాయింట్

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Xiaomi Redmi 4 First Sale in India Sees 250,000 Units Sold in 8 Minutes read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot