అత్యంత తక్కువ ధరకే రెడ్‌మి 4 , బీ రెడీ !

Written By:

షియోమి మరో సంచలనానికి రెడీ అయింది. అత్యంత తక్కువ ధరలో రెడ్‌మి 4ను తీసుకొచ్చేందుకు రెడీ అయింది. మిడ్ రేంజ్ ఫోన్ రెడ్‌మి నోట్ 4ను, అలాగే ఎంట్రీ లెవల్ ఫోన్ రెడ్‌మి 4 ఏను లాంచ్ చేసిన నేపథ్యంలో మరో ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు షియోమి వైస్ ప్రెసిడెంట్ కుమార్ జైన్ ట్విట్టర్లో కొత్త ఫోన్ గురించి పోస్ట్ చేశారు. మరి ఈ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

అంతా రిలయన్స్ జియో పుణ్యమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు సరికొత్త ఫోన్లు

షియోమి నుంచి రెండు సరికొత్త ఫోన్లు రెడ్‌మి 4, రెడ్‌మి 4 ప్రైమ్ లు అతి త్వరలోనే ఇండియా మార్కెట్లో కనువిందు చేయనున్నాయి. వీటిల్లో ముందుగా రెడ్‌మి 4ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ధర

రెడ్‌మి 3ఎస్ కి రీ ప్లేస్ గా రెడ్‌మి 4ను షియోమి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మి 3ఎస్ ప్రస్తుత ధర రూ. 6999గా ఉంది. అయితే రెడ్‌మి 4 ధర దీనికన్నా తక్కువగా రూ. 6,900 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్‌మి 4 ప్రైమ ధర రూ. 8900గా ఉండొచ్చని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

డిస్ ప్లే

ఫీచర్ల విషయానికొస్తే రెడ్‌మి 4 మెటల్ బాడీతో రానుంది. 5 ఇంచ్ పుల్ హెచ్ డి (720) డిస్ ప్లేతో పాటు 2.5డి కర్వ్డ్ గ్లాస్ తో రానుంది. దీంతో పాటు ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 SoC coupledతో పాటు అడెర్నో 505 GPUతో రానుంది.

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 2జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్ డీ ద్వారా 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ తో ఫోన్ రానుంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరాతో f/2.2 aperture, ఎల్ ఈడీ ప్లాష్ లైట్ తో రానుంది. సెల్ఫీ అభిమానుల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 4100mAh batteryతో ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 తో MIUI 8 custom OS మీద రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4 to Launch in India This Month, Teases Company read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot