ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందుకున్న షియోమి రెడ్‌మి K20

|

షియోమి యొక్క రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ 10 స్టేబుల్ అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది. వీబోలో ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 11 అప్‌డేట్ రోల్‌అవుట్‌ను కంపెనీ ధృవీకరించింది. రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైతో ఈ ఏడాది ప్రారంభంలో మేలో లాంచ్ అయింది. తరువాత జూన్ నెలలో గ్లోబల్ మార్కెట్ కోసం షియోమి Mi 9Tగా ప్రారంభించబడింది.

MIUI అప్‌డేట్‌
 

OTA అప్‌డేట్‌ 2.3GB పరిమాణంలో ఉంటుంది. దీని యొక్క బిల్డ్ నంబర్ MIUI V11.0.2.0QFJCNXMగా ఉంటుంది. పుష్ నోటిఫికేషన్‌తో అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయమని వినియోగదారులు ప్రాంప్ట్ చేయబడతారు. ప్రత్యామ్నాయంగా సెట్టింగ్స్ -> అబౌట్ ఫోన్-> సిస్టమ్ అప్‌డేట్‌ణకు వెళ్లడం ద్వారా కూడా అప్‌డేట్‌ను తనిఖీ చేయవచ్చు.

డౌన్‌లోడ్‌లలో రికార్డు సృష్టించిన హాట్‌స్టార్

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌

క్రొత్త ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ సాధారణ Android 10 ఫీచర్లను అందిస్తుంది. అప్‌డేట్‌లో భాగంగా వినియోగదారుని ఇంటర్‌ఫేస్ మెరుగుదలలు, మెరుగైన సిస్టమ్ స్టెబిలిటీతో పాటు గూగుల్ యొక్క తాజా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా తీసుకువస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌ చైనీస్ వినియోగదారులకు మాత్రమే విడుదల అవుతుందని గమనించడం చాలా ముఖ్యం. గ్లోబల్ వేరియంట్లు చైనీస్ వినియోగదారుల కోసం వీడర్ లభ్యత పొందిన వెంటనే అప్‌డేట్‌ను పొందాలి.

2019 లో U.S ఆర్మీ యొక్క అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ

ఆండ్రాయిడ్ 10 OS

తాజా ఆండ్రాయిడ్ 10 OS సిస్టమ్-వైడ్ డార్క్ థీమ్, లైవ్ క్యాప్షన్, మెరుగైన స్మార్ట్ రిప్లై ఫీచర్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 10 తో గూగుల్ ప్రొటెక్షన్ మరియు ప్రైవసీను మెరుగుపరుస్తుంది. ఇక్కడ వినియోగదారులు యాప్లను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే లొకేషన్ డేటాను సేకరించడానికి వినియోగదారులను అనుమతించగలరు.

రెడ్‌మి K20 ఫీచర్స్
 

రెడ్‌మి K20 ఫీచర్స్

షియోమి రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్ ఫుల్ వ్యూ అనుభవం కోసం 6.39-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డివైస్ కార్బన్ బ్లాక్, గ్లాసియర్ బ్లూ మరియు ఫ్లేమ్ రెడ్‌ వంటి మూడు వేర్వేరు కలర్ వేరియంట్ లలో వస్తుంది. ఇది ప్రతిబింబ ఆకృతితో వెనుక వైపు వంగిన గ్లాస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730 SoC తో రన్ అవుతుంది. ఇది 6GB RAM మరియు 64GB లేదా 128GB స్టోరేజ్ ఎంపికలతో వస్తుంది. ఇందులో వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్ ను,రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లతో మరియు మూడవది 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో జత చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా సెల్ఫీల కోసం మరియు వీడియో కాలింగ్ కోసం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi K20 Smartphone Brings Android 10 Update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X