Oppo ColorOS 7 అప్డేట్ ఫీచర్స్ ఏమిటో అవి ఎలా ఉన్నాయో తెలుసా?
ఒప్పో సంస్థ ఇప్పుడు తన ఆండ్రాయిడ్ ఆధారిత సరికొత్త కస్టమ్ OS వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ColorOS 7 ఇండియాలోని వినియోగదారుల కోసం కొత్త అప్డేట్ ఫీచర్స్ , UI చేంజెస్ మరియు లోకలైజ్డ్ లక్షణాలతో వస్తుంది. కలర్‌ఓఎస్ 7 రోల్-అవుట్ దశలవారీగా ఈ రోజు నుండి మొదట ఒప్పో రెనో సిరీస్‌తో ప్రారంభమవుతుంది. త్వరలో ఈ రోల్-అవుట్ ఒప్పో ఫైండ్, F, K మరియు A సిరీస్‌లలో కూడా ప్రారంభమవుతుంది.

ఒప్పో సంస్థ కలర్‌ఓఎస్ 7తో డిజిలాకర్ సేవను ప్రవేశపెట్టింది. దీనిని భారత ప్రభుత్వం 2015 లో మొదటగా ప్రవేశపెట్టింది. కలర్‌ఓఎస్ 7 లో ఈ ఫీచర్ డాక్ వాల్ట్‌గా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తమ డాక్యుమెంట్ లను ఆన్‌లైన్‌లో నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. డిజిలాకర్ సర్వీసును ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ColorOS 7 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఇప్పుడు మరింత మినిమలిస్ట్ డిజైన్‌తో పునరుద్ధరిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు ఆకారం,పరిమాణం మరియు ఫాంట్ పరంగా ఐకాన్స్ లను అనుకూలీకరించవచ్చు.

ఒప్పో సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్‌ను కలర్‌ఓఎస్ 7 తో పరిచయం చేసింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శబ్దాలను సర్దుబాటు చేసే కొత్త వెథర్-అడాప్టివ్ అలారంను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఎంచుకోవడానికి కొత్త వాల్‌పేపర్‌ల సిరీస్ కూడా ఉంది. ఈ కొత్త వాల్‌పేపర్‌లలో భారతీయ స్మారక చిహ్నాలను కూడా కలిగి ఉంటాయి.

ఒప్పో యొక్క కొత్త ColorOS 7 తో మెరుగైన హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తున్నట్లు కూడా వాగ్దానం చేస్తుంది. వినియోగదారులు వాతావరణ సమాచారం కోసం మరియు యాప్ లను తొలగించడం కోసం మరియు ఛార్జింగ్ చేయడం కోసం కొత్త యానిమేషన్లతో కూడిన మరిన్ని UI మార్పులను జోడించింది.

పనితీరు పరంగా కలర్‌ఓఎస్ 7 తో యాప్ లు అన్ని ఇప్పుడు వేగంగా ఓపెన్ అవుతాయి మరియు వేగంగా ప్రారంభమవుతాయి. ర్యామ్ వినియోగం కూడా 40% పెరుగుతుంది, సిస్టమ్ యొక్క ప్రతిస్పందన ట్రాక్షన్‌ను 30%కు పెంచుతుంది. కలర్ ఓస్ 7 లో గేమింగ్ కోసం ఆప్టిమైజ్ చేసిన టచ్ స్పందనలు మరియు ఫ్రేమ్ రేట్లతో కూడా వేగంగా పెరుగుతాయి. టచ్ స్పందనలను 21.6%, ఫ్రేమ్ రేట్‌ను 37% రెట్లు పెంచినట్లు ఒప్పో తెలిపింది.


Click it and Unblock the Notifications








