షియోమి రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్.. అవి ఏంటో చూడండి

|

షియోమి సంస్థ డిసెంబర్ 10 న చైనాలో రెడ్‌మి K 30 స్మార్ట్ ఫోన్ ను అధికారికంగా లాంచ్ చేయబోతోంది. క్వాల్‌కామ్ కంపెనీ కొత్తగా ప్రకటించిన స్నాప్‌డ్రాగన్ 765G చిప్ సెట్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లో మొదటగా రావడం ఈ స్మార్ట్‌ఫోన్ అని నిర్ధారించారు. వచ్చే వారం ప్రారంభించటానికి ముందు షియోమి సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని ముఖ్యమైన ఫీచర్లను వెల్లడించింది. వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి K 30
 

షియోమి సంస్థ కొన్ని రోజుల ముందు రెడ్‌మి K 30 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల డిస్ప్లేను మరియు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇప్పుడు రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ 4,500mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరో మాటలో చెప్పాలంటే బ్యాటరీ దాని ముందున్న 4,000mAh బ్యాటరీ కంటే 500mAh బంప్‌ను పొందుతోంది.

వచ్చే ఏడాది నుంచి రియల్‌మి 4G ఫోన్‌లు ఉండవు... ఎందుకో తెలుసా?

షియోమి రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ 4,500mah బ్యాటరీ

షియోమి రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ 4,500mah బ్యాటరీ

రెడ్‌మి K30 స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కేవలం ఒక గంటలో బ్యాటరీని సున్నా నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో షియోమి సంస్థ ఇప్పుడు మార్కెట్లో వేగంగా ఛార్జింగ్ చేసే స్మార్ట్ఫోన్లలో ఒకటిగా వున్న రియల్ మి X2 ప్రోను అదిగమించే ఉద్దేశంతో కనిపిస్తున్నది. వీబోలోని టీజర్‌లో షియోమి తన 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఇతర 30W ఫాస్ట్ ఛార్జింగ్ పరిష్కారాలకు భిన్నంగా ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాటరీలో స్వతంత్ర ఛార్జ్ పంప్ అమర్చబడి ఉంది. ఇది 97 శాతం వరకు ఛార్జింగ్ ఎక్సచేంజ్ సామర్థ్యాన్ని అందిస్తుందని వెల్లడించింది.

రిలయన్స్ జియో కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

క్విక్ ఛార్జ్
 

ఈ స్మార్ట్‌ఫోన్ క్విక్ ఛార్జ్ మరియు USB పవర్ డెలివరీకి కూడా సహాయపడుతుంది. షియోమి కొంతకాలంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తోంది. ఇది ఇటీవల వీబోలో రిలీజ్ చేసిన టీజర్ ద్వారా ఫోన్ యొక్క ప్రపుల్ షేడ్ మరియు వెనుక వైపు గల క్వాడ్ కెమెరా సెటప్‌ యొక్క పోస్టర్‌ను షేర్ చేసింది. డివైస్ యొక్క వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ నిలువుగా అమర్చబడి ఉంది. అలాగే దీని యొక్క కెమెరా యంత్రాంగం చూడటానికి వృత్తాకార రూపకల్పనతో ఉంది. రెడ్‌మి K30 సిరీస్ మూడు వైపులా సన్నగా ఉండే బెజెల్స్‌తో కూడిన డిస్ప్లేను కలిగి ఉన్నదని టీజర్ లో చూపించింది.

5G క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లు ఎలా ఉన్నాయో తెలుసా

రెడ్‌మి K30

రెడ్‌మి K20 సిరీస్‌లో కనిపించే పాప్-అప్ సెల్ఫీ కెమెరా మెకానిజమ్‌ను షియోమి సంస్థ ఇందులో తీసుకురావడం లేదు. బదులుగా రెడ్‌మి K30 లో గెలాక్సీ S10 + లో కనిపించే పిల్ ఆకారంలో ఉన్న పంచ్ హోల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120HZ డిస్ప్లే మరియు సపోర్ట్ డ్యూయల్ మోడ్ 5Gని అందిస్తుంది. రెడ్‌మి K30 తో షియోమి సంస్థ 5G సపోర్ట్‌తో మరింత మెరుగైన స్మార్ట్‌ఫోన్‌ను డెలివరీ చేయాలని చూస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi K30 Full Specifications You Should Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X