షియోమి నుండి 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్‌... రిలీజ్ ఎప్పుడు?

|

ఇండియాలో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ఏది అంటే షియోమి. ఈ సంస్థ నుండి కొత్తగా ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ వస్తున్నది అంటే దానికి చైనాలో కంటే ఇండియాలో ఎక్కువగా సేల్స్ జరుగుతాయి. దీనికి పోటీగా వున్న మిగిలిన అన్ని సంస్థల నుండి ప్రతి ఒక్కరు 5G కనెక్టివిటీ గల స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసారు. ఆ పోటీ రేసులో తన స్థానాన్ని కాపాడుకోవడానికి మరియు గట్టి పోటీ ఇవ్వడానికి 5G స్మార్ట్‌ఫోన్‌లను 2020లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

గ్లోబల్ పార్టనర్ కాన్ఫరెన్స్‌
 

2019 చైనా మొబైల్ గ్లోబల్ పార్టనర్ కాన్ఫరెన్స్‌లో షియోమి CEO లీ జున్ షియోమి స్మార్ట్‌ఫోన్‌ల భవిష్యత్తు గురించి వివరించారు. తమ నెక్స్ట్-జెన్ స్మార్ట్‌ఫోన్‌లు 5G కనెక్టివిటీతో కూడి ఉండి మిగిలిన వారి కంటే తక్కువకు సరసమైన ధరల వద్ద అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది అని తెలిపారు. 2020 సంవత్సరం నుండి RMB 2,000 (సుమారు రూ .20,000) కంటే ఎక్కువ ధర కలిగిన షియోమి స్మార్ట్‌ఫోన్‌లన్నీ 5G కనెక్టివిటీ ఫోన్‌లుగా ఉంటాయని జూన్ చెప్పారు.

మీరు ఆ వీడియోలు చూస్తున్నారా.. జాగ్రత్త హ్యాకర్లు చూస్తున్నారు

షియోమి 5G ఫోన్ల వ్యూహం

షియోమి 5G ఫోన్ల వ్యూహం

2020 మొదటి ఆరుమాసాలలో కనీసం 10 సరసమైన 5G ఫోన్‌లను ప్రకటించాలని కంపెనీ యోచిస్తోందని జూన్ తెలిపారు. షియోమి ఇప్పటికే షియోమి Mi మిక్స్ 3 5G మరియు వ్రాప్ అరౌండ్ షియోమి Mi మిక్స్ ఆల్ఫా వంటి కొన్ని 5G ఫోన్‌లను ఇప్పటికే అందిస్తోంది. సంస్థ ఇప్పటికే తన AIoT సర్వీస్ ల వాడకం యొక్క అభివృద్ధిని పెంచడానికి 5G + AIoT వ్యూహాన్ని ప్రారంభించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలు ఇవే

షియోమి

అదనంగా షియోమి యొక్క IoT ప్లాట్‌ఫాం కింద 196 మిలియన్ పరికరాలను తయారుచేసింది. అలాగే IoT పరికరాల వినియోగదారుల సంఖ్య ఇప్పుడు సుమారు 3 మిలియన్లకు మించిందని లీ జున్ చెప్పారు. ఇటీవలే మీడియాటెక్ నవంబర్ 26 న తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కోసం ఈవెంట్ సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇంటిగ్రేటెడ్ 5G తో కొత్త చిప్‌సెట్ తో రాబోతున్నది. మీడియాటెక్ యొక్క 5G చిప్ యొక్క మొదటి మోడల్ రెడ్‌మి K30 అయ్యే అవకాశం ఉన్నట్లు కొన్ని పుకార్లు తెల్పుతున్నాయి.

RS.9లకే అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తున్న వోడాఫోన్ సాచెట్ ప్యాక్‌లు

రెడ్‌మి K30 లీకైన వివరాలు
 

రెడ్‌మి K30 లీకైన వివరాలు

రెడ్‌మి K 30 సిరీస్ యొక్క వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొత్తగా లీకైన సమాచారం ప్రకారం ఈ సిరీస్ 5G కనెక్టివిటీ మద్దతుతో వస్తున్నట్లు సూచిస్తున్నాయి. ఇది హుడ్ కింద మీడియాటెక్ SoC ద్వారా రన్ అవుతుంది. దీని ముందు సిరీస్ రెడ్‌మి K 20 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 730 తో లాంచ్ అయింది. అలాగే మీడియాటెక్ హెలియో M 70 5G మోడెమ్‌తో నడిచే మొదటి స్మార్ట్‌ఫోన్‌లు వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ అవుతున్నట్లు ధృవీకరించాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Smartphones Comes With 5G Connectivity Support Verysoon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X