Home
Mobile

రెడ్‌మి నోట్ 4 కోసం చూస్తున్నారా.. అయితే ఈ రోజే సేల్

షియోమి రెడ్‌మి నోట్ 4 ఈ రోజు 12 పీఎమ్ కి ఫ్లిప్‌కార్ట్, మి.కామ్ ద్వారా ఇండియాలో సేల్ కి వెళ్లనుంది.

By Hazarath

షియోమి రెడ్‌మి నోట్ 4 ఈ రోజు 12 పీఎమ్ కి ఫ్లిప్‌కార్ట్, మి.కామ్ ద్వారా ఇండియాలో సేల్ కి వెళ్లనుంది. ఈ ఏడాది జనవరిలో రెడ్‌మి నోట్ 4 ని షియోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధర రూ.9999గా నిర్ణయించారు. మూడు రకాల వేరియంట్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. 2GB RAM/ 32GB ధర రూ.9999 కాగా 3GB RAM/ 32GB ధర రూ. 10,999గానూ, 4GB RAM/ 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 12,999గా కంపెనీ నిర్ణయించింది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

త్వరపడండి.. ఈ ఫోన్ రూ. 10 వేలు తగ్గింది

మూడు ర్యామ్ వేరియంట్లలో ...

మూడు ర్యామ్ వేరియంట్లలో ...

షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే , ప్రాసెసర్

డిస్‌ప్లే , ప్రాసెసర్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

హర్డ్‌వేర్ బటన్స్

హర్డ్‌వేర్ బటన్స్

వచ్చేసరికి హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 to Go on Sale in India Today Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X