Home
Mobile

రెడ్ మి నోట్ 4 బ్లాక్ సేల్ నేడే..

చైనా ఆపిల్‌గా పేరుగాంచిన షియోమి జనవరిలో లాంచ్ చేసిన రెడ్ మి నోట్ 4లో బ్లాక్ వేరియంట్ ని కొత్తగా తీసుకొచ్చి మళ్లీ సరికొత్త అమ్మకాలకు తెరలేపింది.

By Hazarath

చైనా ఆపిల్‌గా పేరుగాంచిన షియోమి జనవరిలో లాంచ్ చేసిన రెడ్ మి నోట్ 4లో బ్లాక్ వేరియంట్ ని కొత్తగా తీసుకొచ్చి మళ్లీ సరికొత్త అమ్మకాలకు తెరలేపింది. లాంచ్ అయిన వారం రోజులకే రికార్డు అమ్మకాలు చవిచూసిన ఈ స్మార్ట్‌‌ఫోన్‌ బ్లాక్‌ కలర్‌ వేయింట్‌ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కామ్‌ ద్వారా ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను ప్రారంభించనుంది. రెడ్‌మి నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి.

పేటీఎమ్ నుంచి కొత్త యాప్

రెడ్మీ నోట్ 4 స్పెక్స్

రెడ్మీ నోట్ 4 స్పెక్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

హర్డ్‌వేర్ బటన్స్

హర్డ్‌వేర్ బటన్స్

వచ్చేసరికి హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. 

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. 

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 Matte Black Colour Variant to Go on Sale in India Today read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X