పేటీఎమ్ నుంచి కొత్త యాప్

Written By:

ఈ కామర్స్ దిగ్గజం పేటీఎం సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పేటీఎం మాల్ పేరుతో కొత్త ఆన్‌లైన్ షాపింగ్ యాప్ (మాల్‌ అండ్‌ బజార్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌)ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పేటీఎం మాల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.?

పేటీఎమ్ నుంచి కొత్త యాప్

ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది.దీంతోపాటు కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు అందిస్తున్నామని పేర్కొంది. పేటీఎం ఎప్పటి నుంచో తన వాలెట్, ఈ-కామర్స్‌ బిజినెస్‌లను ఒకే వేదికగా (యాప్‌) నిర్వహిస్తూ వస్తోంది.

జియో దెబ్బ.. ఎయిర్‌టెల్ సంచలనం

పేటీఎమ్ నుంచి కొత్త యాప్

వాలెట్‌ బిజినెస్‌ను పేమెంట్స్‌ బ్యాంక్‌లో కలిపేస్తుండటంతో కంపెనీ ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా పేటీఎం తన ఈ-కామర్స్‌ బిజినెస్‌ కోసం ఇటీవలనే అలీబాబా నుంచి 200 మిలియన్‌ డాలర్లను సమీకరించింది. అలీబాబాకు స్నాప్‌డీల్‌లో కూడా వాటాలున్నాయి.

English summary
Paytm arm unveils online shopping portal Paytm Mall read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot