షియోమి నుంచి మరో కిల్లర్ ఫోన్ దూసుకొస్తోంది

Written By:

దడ పుట్టించే అమ్మకాలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఓ ఊపు ఊపిన షియోమి వరుస సీరీస్ ఫోన్లతో దూసుకుపోతోంది. షియోమి రెడ్ మీ 3 ఎస్ అలా రిలీజ్ చేసిందో లేదో అప్పుడే మరో ఫోన్ రెడ్ మీ నోట్ 4తో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ప్రతి నాలుగు సెకన్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని కంపెనీ సగర్వంగా ప్రకటించుకున్న తరుణంలో రానున్న ఈ ఫోన్ ఇంకెన్ని సంచలనాలు లేపుతుందనే స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. లీకయిన సమాచారం ప్రకారం షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్స్ కింది విధంగా ఉన్నాయి.

షియోమి అమ్మకాల దడ: ప్రతి 4 సెకన్లకి 5 ..మొత్తం 11 కోట్ల ఫోన్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో పాటు గొరిల్లా గ్లాస్ 4 తో ఈ మొబైల్ వస్తోంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

2 జీహెచ్‌జ‌డ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌, అడ్రినో 506 గ్రాఫిక్స్ తో ఫోన్ సరికొత్త లుక్ తో రానుందని సమాచారం. Faster 64-Bit Octa-core processor అదనపు హైలెట్.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

2GB/3GB/4GB జీబీ ర్యామ్‌,16GB/32GB/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌తో పాటు మైక్రోఎస్టీ కార్డుతో 128 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

గూగుల్ కొత్తగా అప్ డేట్ చేసిన ఆండ్రాయిడ్ 6.0ఓఎస్ ఫ్లాట్ ఫాం మీద పనిచేస్తుంది. దీంతో పాటు డ్యుయ‌ల్ సిమ్ (LTE+LTE), Micro SIM with 4GLTE,

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2, GPS, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ , USB Type C తో రానుంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో ఫోన్ రానుంది. ఈ ఈ కెమెరాలతో పవర్ పుల్ ఫోటోలు తీసుకోవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

4100 ఎంఏహెచ్ పవర్ పుల్ బ్యాట‌రీతో ఫోన్ రానుంది.బరువు ఎంత ఉంటుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

2GB+16GB ధర రూ. 10 వేలు ఉండే అవకాశం ఉంది.
3GB+32GB రూ. 12,000 వేలు ఉండే అవకాశం ఉంది.
4GB+64GB రూ. 15,000 వేలు ఉండే అవకాశం ఉంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 4 ఫీచ‌ర్లు

రానున్న ఈ ఫోన్ లెనోవా, శాంసంగ్, హెచ్ టీసీ ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి.

షియోమి నుంచి రెడ్ మీ 3ఎస్

షియోమి నుంచి దూసుకొచ్చిన రెడ్ మీ నోట్ 3 ఫీచర్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Xiaomi Redmi Note 4 Price, Release date, Leaked Specifications
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot