షియోమి నుంచి కొత్త ఫోన్ లీకయింది

కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ వస్తోంది. రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరుతో రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

By Hazarath
|

షియోమి నుంచి వచ్చిన ఫోన్లు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఆ కంపెనీ నుంచి వచ్చిన రెడ్ మి నోట్ 3 అయితే ఓ ప్రభంజనాన్నే సృష్టించింది. రికార్డు స్థాయి అమ్మకాలతో దిగ్గజాలకే ముచ్చెమటలు పట్టించింది. ఇప్పుడు అదే కంపెనీ నుంచి మరో కొత్త ఫోన్ వస్తోంది. రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరుతో రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

 

ఇకపై మీ ఇంటికే జియో సిమ్, డెలివరీ చేయనున్న స్నాప్‌డీల్

 రెడ్ మి నోట్ 4 ఎక్స్

రెడ్ మి నోట్ 4 ఎక్స్

షియోమి నుంచి త్వరలో రెడ్ మి నోట్ 4 ఎక్స్ పేరిట త్వరలో ఓ ఫోన్ వినియోగదారుల ముందుకు రానుంది. ఇప్పటికే నోట్ 4 చైనాలో విడుదలవ్వగా ఇది త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అదే ఊపులో అమ్మకాలు

అదే ఊపులో అమ్మకాలు

జనవరి నాటికి భారత మార్కెట్లోకి రెడ్ మి నోట్ 4 , 4ఎక్స్ ఫోన్లు రానున్నాయని సమాచారం. ఇప్పటికే ఇండియా మార్కెట్లో రెడ్ మి నోట్ 3, 3 ఎస్ ప్రైమ్ భారీగా అమ్మకాలను కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇవి కూడా అదే ఊపులో అమ్మకాలు జరుగుతాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

అత్యాధునిక స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ను
 

అత్యాధునిక స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ను

రానున్న ఈ ఫోన్ లో అత్యాధునిక స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ను వాడినట్లు తెలుస్తోంది. ఇది ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

 రామ్

రామ్

ఇందులో 4 జీబీ రామ్ తో పాటు 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ పొందుపరిచారు. రెడిమి నోట్ 4 రెండు వేరియంట్లలో విడుదలయన విషయం తెలిసిందే. 2GB RAM/16GB ROM and 3GB/64GB ROMతో ఈ ఫోన్ చైనా మార్కెట్లో రిలీజయింది.

హెచ్డీ డిస్ ప్లే

హెచ్డీ డిస్ ప్లే

5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్తో ఈ ఫోన్ మూడు రంగుల్లో లభ్యమవనుంది. దీని ధర సుమారు రూ .12 వేలు నుంచి 15 వేలు ఉండే అవకాశం ఉంది.

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 ఎంపీ కెమెరాతో పాటు 5 ఎంపీ సెల్పీ షూటర్ తో రానున్నట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4X with Snapdragon 653, 4GB RAM spotted online read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X