షియోమి మళ్లీ కొత్త ఫోన్‌తో వస్తోంది

Written By:

షియోమి నుంచి మరో సరికొత్త ఫోన్ దూసుకొస్తోంది. Redmi Note 4తో ఇండియాలో సంచలనాలు సృష్టించిన ఈ కంపెనీ అదే ఊపులో తన నూతన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ ప్రొ2'ను మార్కెట్లోకి తీసుకురావాలని అనుకుంటోంది. 4జిబి ,6జిబి ర్యామ్ తో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకోనుంది. అయితే లాంచింగ్ తేదీ ఎప్పుడు ?. అలాగే దాని ధర ఎంత ? ఇలాంటి విషయాలను షియోమి ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

128జిబితో ఐఫోన్ ఎస్ఈ, దుమ్మురేపనున్న ఆపిల్ ఈవెంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేతో పాటు 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఆక్టాకోర్ ప్రాసెసర్ ను కూడా కలిగి ఉంది.

image: redmi pro

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4/6 జీబీ ర్యామ్ తో పాటు 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు.
image: redmi pro

కెమెరా

కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.
image: redmi pro

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అదనపు ఆకర్షణలు.
image: redmi pro

చైనా కరెన్సీలో

అయితే చైనా కరెన్సీలో 4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర 1599 యువాన్లుగా ఉంది. 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర 1799యువాన్లుగా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Pro 2 Smartphone leaks with 6GB RAM & 4500mAh Battery read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot