128జిబితో ఐఫోన్ ఎస్ఈ, దుమ్మురేపనున్న ఆపిల్ ఈవెంట్

Written By:

మిగతా కంపెలను సవాల్ చేస్తూ ఆపిల్ ఈ నెల్లో ఓ భారీ ఈవెంట్ ని నిర్వహించబోతుందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరికొత్త ఉత్పత్తులతో ఈ ఈవెంట్ అదిరిపోయేలా ఆపిల్ నిర్వహించనుందని టెక్ వైబ్‌సైట్ మ్యాక్ రూమర్స్.కామ్ రిపోర్టు చేసింది. ఈ ఈవెంట్ లోనే ఐప్యాడ్స్, కొత్త ఆపిల్ ఫోన్, వాచీ బ్యాండ్స్ ఆవిష్కరించనుందని మ్యాక్ రూమర్స్.కామ్ తెలిపింది.

ఇంటెల్ అతి పెద్ద డీల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10.5 అంగుళాల స్లిమర్ బెజిల్స్ తో కొత్త ఐప్యాడ్ ప్రొ

ఈ ఈవెంట్ ఈ నెలాఖరున జరగబోతోంది. ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రొను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. 9.7 అంగుళాల, 12.9 అంగుళాల వెర్షన్లను అప్ డేట్ చేసిన ఆపిల్, 10.5 అంగుళాల స్లిమర్ బెజిల్స్ తో ఈ కొత్త ఐప్యాడ్ ప్రొను తీసుకురాబోతుందని టెక్ వెబ్‌సైట్ మ్యాక్ రూమర్స్.కామ్ రిపోర్టు చేసింది.

హోమ్ బటన్ ఉండదట

అయితే ఈ ఐప్యాడ్ ప్రొలో హోమ్ బటన్ ఉండదట. హైయర్-రెజుల్యూషన్ డిస్ ప్లే, క్వాడ్ మైక్రోఫోన్స్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. అప్ డేట్ చేసిన 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను, ప్రస్తుతమున్న 9.7 అంగుళాల మోడల్ మాదిరిగా ట్రూ టోన్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని టాక్.

128జీబీ స్టోరేజ్‌తో అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ

అంతేకాక 128జీబీ స్టోరేజ్‌తో అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ను, కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్ ను ఆవిష్కరించనున్నట్టు టెక్ వర్గాల టాక్.

సరికొత్త ఐఫోన్ 8

అదేవిధంగా ఓమోలెడ్ డిస్ ప్లేతో 5.8 అంగుళాల సరికొత్త ఐఫోన్ 8 ను లాంచ్ చేయబోతున్నామని, మరో రెండు డివైజ్ లను తీసుకురాబోతున్నామని ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మిగతా రెండు డివైజ్ లు

మిగతా రెండు డివైజ్ లు అప్‌డేటెడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లని తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్ లు కూడా ఈ ఈవెంట్లోనే వినియోగదారుల ముందుకు రావొచ్చని కొందరంటున్నారు.

మార్చి 20 సోమవారం, మార్చి 24 శుక్రవారం మధ్యలో

ఆపిల్ నిర్వహించే ఆ ఈవెంట్ మార్చి 20 సోమవారం, మార్చి 24 శుక్రవారం మధ్యలో ఉంటుందని టెక్ వర్గాల సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
Apple expected to unveil new products this month read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting