షియోమి యూజర్లకు శుభవార్త !

Written By:

షియోమి యూజర్లకు కంపెనీ నుంచి త్వరలో శుభవార్త అందనుందని తెలుస్తోంది. చైనా మొబైల్‌ తయారీ దారు షియోమి మరిన్ని ఫోన‍్లను అప్‌డేట్‌ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. జూన్‌ నెలలో ఎంఐ మ్యాక్స్‌ను ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్ ఆపరేటింగ్‌ సిస్టంతో ఎంఐయూఐ అప్‌డేట్‌ను అందించిన షియోమి.. త్వరలో మరికొన్ని ఫోన్లకు నౌగట్‌ ఓఎస్‌తో అప్‌డేట్‌ను ఇవ్వనుంది. త్వరలో ఎంపిక చేసిన 14 ఫోన్లకు ఈ అప్‌డేట్‌ అందుతుందని సమాచారం. అయితే జాబితాలో రెడ్‌మి 4 లేదని తెలుస్తోంది.

మిస్ యూజ్ కాకుండా ఆధార్ డేటాను భద్రంగా కాపాడుకోవడమెలా...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గిజ్‌మో చైనా

గిజ్‌మో చైనా అదించిన సమాచారం ప్రకారం రెడ్‌మి ఎంఐ 4 ఎక్స్‌, షియోమి ఎంఐ మ్యాక్స్‌, ఎంఐ నోట్‌ 2, రెడ్‌మి నోట్‌ 4 ఎక్స్‌, ఎంఐ మిక్స్‌, ఎంఐ 5, ఎంఐ 5ఎస్‌, ఎంఐ 5ఎస్‌ ప్లస్‌, షియోమి ఎంఐ 6, ఎంఐ మ్యాక్స్‌ 2, ఎంఐ 5సి, రెడ్‌మి 4 ఎక్స్‌ తదితర ఫోన్లు అప్‌డేట్‌ అందుకోనున్న జాబితాలో ఉన్నాయి.

రెడ్‌ మి 4

అయితే ఆశ్యర్యకరంగా రెడ్‌ మి 4ను దీన్నుంచి మినహాయింపునిచ్చింది. కాగా ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 7.1 శాతం డివైస్‌లు అప్‌డేట్‌కాగా, 7.1 ఓ ఎస్‌తో 0.5 శాతం డివైస్‌ అప్‌డేట్‌ అయ్యాయి.

మొబైల్ ఆపరేటింగ్ స్టేషన్

మొబైల్ ఆపరేటింగ్ స్టేషన్ గూగుల్ పిక్సెల్ , పిక్సెల్ ఎక్స్‌ఎల్‌ లతో ప్రారంభించబడిన సంగతి విదితమే.

నెక్సస్‌ స్మార్ట్‌ఫోన్లలోనూ

అలాగే నెక్సస్‌ స్మార్ట్‌ఫోన్లలోనూ, పిక్సెల్ టాబ్లెట్, నెక్సెస్‌ ప్లేయర్ సహా ఇతర ఆండ్రాయిడ్‌ డివైస్‌లో లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.

నౌగట్ అప్‌డేట్‌ విషయంపై

అయితే నౌగట్ అప్‌డేట్‌ విషయంపై కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi releases list of 14 devices in line to get Nougat update, says report Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot