షియోమీ, గూగుల్ కాంభినేషన్‌లో Android One స్మార్ట్‌ఫోన్

డ్యుయల్ కెమెరా సపోర్ట్‌తో రావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోన్న Xiaomiతో గూగుల్ జతకట్టినట్లు తెలుస్తోంది. షియోమీ, గూగుల్ కాంభినేషన్‌లో Android One స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతున్నట్లు సమాచారం.

 

మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పొందటం ఎలా..?మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పొందటం ఎలా..?

Xiaomi A1 పేరుతో..

Xiaomi A1 పేరుతో..

ప్రముఖ ఇండోనేషియన్ బ్లాగ్ క్రిస్పీటెక్ వెల్లడించిన వివరాల ప్రకారం Xiaomi A1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. డ్యుయల్ కెమెరా సపోర్ట్ తో రావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

ఆండ్రాయిడ వన్ ప్రాజెక్టు గురించి క్తుప్తంగా...

ఆండ్రాయిడ వన్ ప్రాజెక్టు గురించి క్తుప్తంగా...

గూగుల్ తన ఆండ్రాయిడ వన్ ప్రాజెక్టును 2014లో లాంచ్ చేసింది. చౌకధర స్మార్ట్‌ఫోన్‌లకు సైతం ఆండ్రాయిడ్ అనుభూతులను చేరవ చేయాలనే లక్ష్యంతో డిజైన్ చేయబడిన ఈ స్టాక్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి కంపెనీలు తక్కువ ధరల్లో Android One స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికి ఆదరణ కొరవడటంతో గూగుల్ ఈ ప్రాజెక్టును కొంత కాలం పక్కన పెట్టింది. చాలా రోజుల గ్యాప్ తరువాత షియోమీ సంస్థ సహకారంతో మరో ఆండ్రాయిడ్ వన్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతుందా..?
 

ఆండ్రాయిడ్ పై గూగుల్ పట్టు కోల్పోతుందా..?

ప్రపంచపువ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్ ఒకటి. నిత్యం సరికొత్త అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోన్న గూగుల్‌కు ముందుగా మనం హ్యాట్సాఫ్ చెప్పుకోవాలి. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ OEMs అలానే developersకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిస్థితులు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. కన్స్యూమర్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ పై గూగుల్ నియంత్రణ కోల్పోవటానికి గల పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం...

7.5శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే..

7.5శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే..

Android N మార్కెట్లో లాంచ్ అయిన కొన్ని నెలల కావొస్తుంది. ఈ ఓఎస్‌కు ముందు వర్షన్‌గా వచ్చిన Android Marshmallowను కేవలం 7.5శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మాత్రమే ఉపయోగించు కుంటున్నారట. చాలా వరకు ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికి లాలీపాప్ లేదా కిట్‌క్యాట్ వర్షన్‌నే ఉపయోగించుకుంటున్నారట.

 పాతది వాడకముందే కొత్తది.

పాతది వాడకముందే కొత్తది.

చాలా వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కొత్త ఫోన్‌ల రిలీజ్ విషయంలో సందిగ్థతకు లోనవుతున్నాయట. తమ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ ఆప్షన్ ఇచ్చే‌కంటే లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్‌తోనే లాంచ్ చేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తున్నాయట. దీంతో యూజర్లు పాత వర్షన్‌లు వాడకుండానే కొత్త వర్షన్‌కు జంప్ అవ్వాల్సి వస్తోంది.

అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి..

అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి..

గూగుల్ నెక్సుస్ బ్రాండ్ నుంచి విడుదలైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌ను అంతగా ఆకట్టుకోలేకపోవటంతో ఆ బ్రాండ్‌ను గూగుల్ నిలిపివేసింది. నెక్సుస్ స్థానంలో పిక్సల్ పేరుతో మరో బ్రాండ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.  గూగుల్ తన ఆండ్రాయిడ్ సక్సెస్‌ను స్మార్ట్‌వాచ్‌లకు విస్తరింపచేసింది. ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టంతో మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్‌వాచ్‌లకు ప్రస్తుతం డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది.

లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం..

లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం..

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లలో లుక్ ఇంకా ఫీల్ పరంగా పెద్దగా మార్పులు లేకపోవటం కారణంగా చాలా వరకు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమకంటూ ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ స్కిన్‌లను ఎంపిక చేసుకుంటున్నాయి.

ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు..

ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు..

గూగుల్ నెక్సుస్ ఐడియాను తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అమలు చేసే ఉద్దేశ్యంతో గూగుల్ తీసుకువచ్చిన ఆండ్రాయిడ్ వన్ ప్రాజెక్ట్ అంతగా సఫలం కాలేదు.

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో...

ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో...

గూగుల్ ఆండ్రాయిడ్, ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో ఎవరైనా దీనికి యాప్‌ను తయారు చేయవచ్చు. ఈ వెసలబాటును తమకు అనుగుణంగా మలచుకుంటున్న ముష్కర సంస్థలు ప్రత్యేకమైన యాప్స్ ద్వారా తమ ప్రచారాలను సాగించుకుంటున్నాయి.

సెక్యూరిటీ పెద్ద సవాల్‌

సెక్యూరిటీ పెద్ద సవాల్‌

ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారింది. అనేక మాల్వేర్లు నిత్యం ఈ ఓఎస్‌ను చుట్టుముడుతూనే ఉన్నాయి.

Read More : మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పొందటం ఎలా..?

Best Mobiles in India

English summary
Xiaomi working on an Android One smartphone: Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X